Published
Fri, Aug 5 2016 8:10 PM
| Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
యాదాద్రి జిల్లా సాధించే వరకు ఉద్యమం
యాదగిరిగుట్ట : భువనగిరి కేంద్రంగా యాదాద్రిని జిల్లాగా ప్రకటించే వరకు ఉద్యమం చేస్తామని టీడీపీ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. జిల్లా సాధన కోసం సీపీఐ, బీజేపీలతో కలిసి చేపట్టిన ప్రజాభిప్రాయ సంతకాల సేకరణ కార్యక్రమం ముగింపు సందర్భంగా యాదగిరిగుట్టలోని శ్రీనృసింహుడి వైకుంఠద్వారం వద్ద పోస్టుకార్టులకు పూజలు చేసి, తపాల కార్యాలయం ద్వారా సీఎం క్యాంప్ కార్యాలయానికి పంపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రిని జిల్లాగా ప్రకటించనుండడం హర్షణీయమన్నారు. ఆలేరు నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉండాలంటే గోదావరి జలాలే శరణ్యమని, ఈ జలాలు ఈ ప్రాంతానికి ఇవ్వాలనే రెండవ డిమాండ్‌తో సైతం పోస్టుకార్డుల్లో రాసినట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గోద శ్రీరాములు, తెలుగు మహిళ అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, ముంకుదరెడ్డి, పల్లెపాటి బాలయ్య, దడిగె ఇస్తారి, ఆకుల రాజేష్, బొలగాని సత్యనారాయణ, గుంటి మధుసూదన్‌రెడ్డి, జిల్లా భిక్షపతి, ఆరె రాములు, అమరేందర్‌రెడ్డి, గొట్టిపర్తి శ్రీనివాస్‌గౌడ్, అమరేందర్, సీత నారాయణ, మోత్కుపల్లి రఘు, ఆంజనేయులు, పోశంరెడ్డి, సుధాకర్‌రెడ్డి, బాల్‌రెడ్డి, పద్మనాభం, పూర్ణచందర్ రాజు తదితరులున్నారు.