దశాబ్ధాల తెలంగాణ కలకు అడ్డుపడుతూ సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించింది ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డేనని
సీమాంధ్ర ఉద్యమాన్ని కిరణే నడిపిస్తుండు
Published Wed, Aug 28 2013 3:07 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
ఇందూరు,న్యూస్‌లైన్:దశాబ్ధాల తెలంగాణ కలకు అడ్డుపడుతూ సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించింది ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డేనని జేఏసీ జిల్లా చైర్మన్ గోపాల్‌శర్మ ఆరోపించారు. ఎవరెంత రెచ్చగొట్టినా శాంతియుతంగా తెలంగాణను సాధించుకుంటామని, ఇందులో భాగంగా వచ్చే నెల 3న జిల్లాకేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో శాంతిదీక్ష చేపడుతున్నామన్నారు. స్థానిక టీఎన్‌జీవోస్ భవన్‌లో మంగళవారం జేఏసీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శాంతి దీక్ష, బహిరంగ సభకు రాష్ట్ర రాజకీయ జేఏసీ స్టీరింగ్ కమిటీ నాయకులు హాజరవుతారన్నారు. జిల్లాలోని తెలంగాణవాదులందరూ ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. శాంతియుతంగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాంధించుకుందామన్నారు.
అయితే తెలంగాణ ఉద్యమంలో తాము సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులపై, ప్రజాప్రతి నిధులపై ఎలాంటి దాడులకు పూనుకోలేదని, కానీ నిన్నగాక మొన్న పుట్టిన సీమాంధ్ర కృత్రిమ ఉద్యమంలో తెలంగాణ ప్రాంతం వారిపై దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. సీపీఎం,టీడీపీ,కాంగ్రెస్ పార్టీలు సీమాంధ్రుల్లో భావోద్వేగాలు సృష్టించి రాష్ట్ర ఏర్పాటుకు అడ్డం పడుతున్నారని ఆరోపించారు. సీఏం కిరణ్ సీమాంధ్ర ఉద్యమానికి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారని ఆయన వల్లే విగ్రహాలు ధ్వంసం అవుతున్నాయన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదని, శాంతియుతంగా సాధించుకుంటామని స్పష్టంచేశారు. సమావేశంలో జేఏసీ జిల్లా కన్వీనర్ గైని గంగారాం, నాయకులు విఠల్, భూమయ్య, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement