
మునగాలలో ఉత్తమ్‌కు స్వాగతం పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
సాక్షి, మునగాల : టీపీసీసీ అధ్యక్షుడు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి శనివారం మండల కేంద్రంలో ఘనస్వాగతం లభించింది. హుజుర్‌నగర్‌లో నామినేషన్ దాఖలు చేసేందుకు హైదరాబాద్ నుంచి హుజుర్‌నగర్ వెళుతూ మార్గమధ్యలో మునగాలలో ఆగినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుఢు నల్లపాటి శ్రీనివాస్ నాయకత్వంలో సుమారు రెండువేల మంది ఉత్తమ్‌కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
ఉత్తమ్‌కు స్వాగతం పలికిన కోదాడ నాయకులు
కోదాడరూరల్ : టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నామినేషన్ వేసేందుకు హుజూర్‌నగర్ వెళ్తుండగా మార్గ మధ్యలోని కొమరబండ బైపాస్‌లో ఆయనకు కోదాడ పట్ణణ, మండల నాయకులు పుష్పగుచ్ఛం అందజేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయనతో పాటుగా ర్యాలీగా హుజూర్‌నగర్ వెళ్లారు. స్వాగతం పలికిన వారిలో మాజీ ఎంపీపీ వంగవేటి రామారావు, సంపెట రవి, ధనమూర్తి, ప్రసాద్‌రెడ్డి, రహీం, కోటేశ్వరావు, ముస్తాఫా తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment