పాముకాటుతో ఎన్‌సీసీ విద్యార్థికి అస్వస్థత | Student Illnesses with snake bite | Sakshi
Sakshi News home page

పాముకాటుతో ఎన్‌సీసీ విద్యార్థికి అస్వస్థత

Published Mon, Aug 15 2016 11:51 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

Student Illnesses with snake bite

హుజూర్‌నగర్‌ : మట్టపల్లి కృష్ణాపుష్కరాల్లో విధులు నిర్వహించే ందుకు వచ్చిన నల్లగొండ ఎన్‌జీ కాలేజీకి చెందిన ఎన్‌సీసీ విద్యార్థి ఎస్‌కే.మస్తాన్‌ ఆదివారం అర్థరాత్రి పాముకాటుకు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే... కృష్ణాపుష్కరాల్లో ట్రాఫిక్‌ డ్యూటీ నిర్వహించిన మస్తాన్‌ మఠంపల్లిలోని మోడల్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన వసతి స్థలానికి చేరుకున్నాడు. రాత్రి భోజనం చేసి చేతిని శుభ్రం చేసేందుకు కుళాయి వద్దకు వెళ్లాడు. చేతిని శుభ్రం చేసుకుంటున్న క్రమంలో కట్లపాటు కాటు వేసింది. దీంతో మస్తాన్‌ వెంటనే తోటి విద్యార్థులకు సమాచారం తెలుపగా పాము కోసం వెతుకులాడగా అది తప్పించుకుపోయింది. పాముకాటుగా నిర్ధారించుకున్న వెంటనే పోలీసులు, అధికారుల సాయంతో హుజూర్‌నగర్‌లోని ప్రైవేట్‌ వైద్యశాలకు  తరలించారు. ప్రస్తుతం విద్యార్థికి ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు తెలిపారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement