నేరేడుచర్ల(హుజూర్‌నగర్) : ప్రేమించి మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఈ సంఘటన శుక్రవారం పాలకీడు పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకీడు మండలం కల్మెటతండాకు చెందిన భూక్యా దాస్ (లేటు) కుమార్తె రేణుకను (23) అదే గ్రామానికి చెందిన రూపావత్ చంద్రశేఖర్ ప్రేమించి గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోమని రేణుక నిలదీయడంతో చంద్రశేఖర్ నిరాకరించాడు. ఆమె పాలకీడు పోలీస్ స్టేషన్‌లో చంద్రశేఖర్, అతని కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్‌ఐ యాదావేందర్‌రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.