
బాధితురాలికి సర్దిచెబుతున్న ఎస్‌ఐ రాజ్‌కుమార్
వెలిగండ్ల: యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన ఆర్మీ క్లర్క్‌పై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ రాజ్‌కుమార్ కథనం ప్రకారం.. మొగళ్లూరుకు చెందిన గంగవరపు ప్రవళ్లిక అదే గ్రామానికి చెందిన పూనూరి ప్రతాప్‌లు నాలుగేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ప్రతాప్ ఆర్మీలో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. తల్లికి కుమారుడి ప్రేమ వ్యవహారం నచ్చ లేదు. ఈ నెలలో తెలంగాణకు చెందిన మరో యువతితో అతడికి వివాహం చేశారు. విషయం తెలుసుకున్న ప్రవళ్లిక, ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఈ నెల 8వ తేదీన స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ రాజ్‌కుమార్ ఇరువర్గాల బంధువులను పిలిపించి విచారించారు. ప్రవళ్లిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ నెల 8వ తేదీన ఫిర్యాదు చేస్తే ప్రతాప్‌కు వివాహం జరిగే వరకూ పట్టించుకోలేదని బంధువులు పోలీసుస్టేషన్ ముందు కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment