
హరీశ్ రెడ్డి ఇంటి ఎదుట బైఠాయించిన లావణ్యతో మాట్లాడుతున్న పోలీసులు
నల్లకుంట: ప్రేమ పేరుతో మోసం చేశాడని, న్యాయం చేకూర్చాలంటూ ఓ యువతి ప్రేమికుడి ఇంటి ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టింది. విషయం తెలుసుకున్న నల్లకుంట పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ మురళీధర్, బాధితురాలు కథనం ప్రకారం వివరాలు.. నల్లకుంట తిలక్‌నగర్‌లో నివాసముండే జె. లావణ్య(29)కు ఏడాది క్రితం నల్లకుంటలోని ‘ప్‌లైటీస్’ బట్టల షాప్ యజమాని వై. హరీశ్ రెడ్డి(30)తో పరిచయమేర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
ఈ క్రమంలో లావణ్యను వివాహం చేసుంటానని నమ్మబలికిన హరీశ్‌రెడ్డి మాయమాటలతో మో సం చేశాడు. ఆ తరువాత పెళ్లి విషయం అడిగితే పెళ్లి చేసుకోను.. ఏం చేసుకుంటావో చేసుకోమని బెదిరించాడు. ఈ విషయమై లావణ్య ఈ నెల 4వ తేదిన నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు ఇన్వెస్టిగేషన్‌లో ఉండగానే పోలీసులు హరీశ్ రెడ్డిని అరెస్టు చేయలేదని, తనకు న్యాయం జరగడంలేదంటూ అసహనానికి లోనైన లావణ్య శనివారం తిలక్‌నగర్‌లోని హరీశ్‌రెడ్డి ఇంటి ఎదుట «బైఠాయించి ధర్నా చేపట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు తిలక్‌నగర్‌లోని హరీశ్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. అనంతరం నిందితుడు వై.హరీశ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment