Published
Sun, Aug 28 2016 8:22 PM
| Last Updated on Mon, Sep 4 2017 11:19 AM
అదనపు జిల్లా కోర్టును ఏర్పాటు చేయాలి
హుజూర్‌నగర్: పట్టణంలోని కోర్టులో అన్ని వసతులు ఉన్నందున అదనపు జిల్లా కోర్టును ఏర్పాటు చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కుక్కడపు బాలకృçష్ణ కోరారు. ఆదివారం స్థానికంగా జరిగిన అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోనే మోడల్ కోర్టుగా అత్యాధునిక హంగులతో హుజూర్‌నగర్ కోర్టును నిర్మించడం జరిగిందన్నారు. అంతేగాక అన్ని అవకాశాలు ఉన్న హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసే విషయమై చొరవ చూపాలన్నారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి జక్కుల వీరయ్య, కోశాధికారి ఉదారి యాదగిరి, క్రీడా కార్యదర్శి భూక్యా నాగేశ్వరరావు, సాంస్కృతిక కార్యదర్శి కె.ప్రదీప్తి, సీనియర్ న్యాయవాదులు కొణతం శ్రీనివాసరెడ్డి, విజయదుర్గ పాల్గొన్నారు.