dist court
-
చీటింగ్ కేసులో ఇద్దరికి రెండేళ్ల జైలు
లీగల్ (కడప అర్బన్) : కడప వన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో 2013లో నమోదైన ఓ చీటింగ్ కేసులో ఇద్దరిలో ఒక్కొక్కరికి రెండు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 5 వేలు జరిమాన విధిస్తూ బుధవారం జిల్లా కోర్టులోని ఎకై ్సజ్ కోర్టు మెజిస్ట్రేట్ లావణ్య తీర్పునిచ్చారు. ఈ సంఘటనలో చౌటపల్లె వీరారెడ్డి 2013లో వీరస్వామిమండివీధిలో ఓ ఇంటిని రూ. 43 లక్షలకు బేరం ఆడి రూ. 27 లక్షలను చెల్లించి అగ్రిమెంటు చేయించుకున్నాడు. నాలుగు నెలల తర్వాత నిందితులైన బాలరాజు, యల్లాలు, వెంకటేశ్వర్లు సదరు ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించకపోవడంతో వీరారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పై ముగ్గురిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఏపీపీ తాజుద్దీన్ కేసు రుజువు చేసేందుకు తమవంతు వాదించారు. ఈ క్రమంలో బాలరాజు, యల్లాలుపై నేరం రుజువు కావడంతో రెండేళ్లు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. -
జడ్జి విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తికి జైలు
నిజామాబాద్: కోర్టులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వారిని బెదిరించి, జడ్జి విధులకు ఆటంకం కలిగించిన ఒకరికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ శీతల్ సరిత బుధవారం తీర్పు ఇచ్చారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జయరామ్ నాయక్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ ప్రాంతానికి చెందిన రహమాన్ ఓ క్రిమినల్ కేసులో విచారణకు 2013 డిసెంబర్ 17న నిజామాబాద్ ప్రత్యేక ప్రథమశ్రేణి సంచార న్యాయస్థానంలో హాజరయ్యాడు. ఈ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన అస్మా బేగంభాను, రజియా బేగంలను బెదిరించాడు. వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతారా అంటూ కోర్టులోనే హల్చల్ చేశాడు. జడ్జి విధులకు ఆటంకం కలిగించాడు. దీంతో అతనిపై ఒకటో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి అభియోగ పత్రాన్ని కోర్టులో సమర్పించారు. ఈ కేసులో జడ్జి సరిత బుధవారం తీర్పు ఇచ్చారు. నిందితుడికి ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించారు. -
అదనపు జిల్లా కోర్టును ఏర్పాటు చేయాలి
హుజూర్నగర్: పట్టణంలోని కోర్టులో అన్ని వసతులు ఉన్నందున అదనపు జిల్లా కోర్టును ఏర్పాటు చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కుక్కడపు బాలకృçష్ణ కోరారు. ఆదివారం స్థానికంగా జరిగిన అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోనే మోడల్ కోర్టుగా అత్యాధునిక హంగులతో హుజూర్నగర్ కోర్టును నిర్మించడం జరిగిందన్నారు. అంతేగాక అన్ని అవకాశాలు ఉన్న హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసే విషయమై చొరవ చూపాలన్నారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి జక్కుల వీరయ్య, కోశాధికారి ఉదారి యాదగిరి, క్రీడా కార్యదర్శి భూక్యా నాగేశ్వరరావు, సాంస్కృతిక కార్యదర్శి కె.ప్రదీప్తి, సీనియర్ న్యాయవాదులు కొణతం శ్రీనివాసరెడ్డి, విజయదుర్గ పాల్గొన్నారు.