లీగల్ (కడప అర్బన్) : కడప వన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో 2013లో నమోదైన ఓ చీటింగ్ కేసులో ఇద్దరిలో ఒక్కొక్కరికి రెండు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 5 వేలు జరిమాన విధిస్తూ బుధవారం జిల్లా కోర్టులోని ఎకై ్సజ్ కోర్టు మెజిస్ట్రేట్ లావణ్య తీర్పునిచ్చారు. ఈ సంఘటనలో చౌటపల్లె వీరారెడ్డి 2013లో వీరస్వామిమండివీధిలో ఓ ఇంటిని రూ. 43 లక్షలకు బేరం ఆడి రూ. 27 లక్షలను చెల్లించి అగ్రిమెంటు చేయించుకున్నాడు. నాలుగు నెలల తర్వాత నిందితులైన బాలరాజు, యల్లాలు, వెంకటేశ్వర్లు సదరు ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించకపోవడంతో వీరారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పై ముగ్గురిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఏపీపీ తాజుద్దీన్ కేసు రుజువు చేసేందుకు తమవంతు వాదించారు. ఈ క్రమంలో బాలరాజు, యల్లాలుపై నేరం రుజువు కావడంతో రెండేళ్లు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పునిచ్చారు.
చీటింగ్ కేసులో ఇద్దరికి రెండేళ్ల జైలు
Published Thu, Oct 6 2016 1:14 AM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM
Advertisement