హుజూర్‌నగర్
హుజూర్‌నగర్ పట్టణం లింగగిరి రోడ్డులో గల శ్రీసత్యనారాయణస్వామి పార్‌బాయిల్డ్ మోడ్రన్ రైస్‌మిల్లులో శుక్రవారం రాత్రి బాయిలర్ పేలిన ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. మిల్లు డ్రైవర్ బైరుమళ్ల రాములు (50) మృతదేహం శనివారం లభ్యమైంది. ప్ర మాదంలో ఇద్దరు మృతిచెందగా శుక్రవా రం రాత్రే దినసరి కూలీ అలివేలు మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. ప్ర మాదం అనంతరం రాములు ఆచూకీ తెలి యకపోవడంతో ప్రత్యేక లైట్లను ఏర్పాటు చేసి క్రేన్ల ద్వారా మిల్లు పరిసర ప్రాంతాలను వెతికారు. అయితే బాయిలర్ పేలిన ప్రమాదంలో రాములు మృతదేహం ముక్కలుగా ఛిద్రమై మిల్లు చుట్టుపక్కల ప్రాంతాలలో పడిపోవడంతో విడి విడిగా శరీర భాగాలు లభ్యమయ్యాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహం భాగాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నా రు. బాయిలర్ పేలిన తాకిడికి పార్‌బాయి ల్డ్ మిల్లు ఆసాంతం ధ్వంసమైంది. కాగా మిర్యాలగూడ డీఎస్పీ గోనె సందీప్ సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన బాయిలర్ డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ..
పార్‌బాయిల్డ్ మిల్లులో బాయిలర్ పేలిన ప్రమాద సంఘటన స్థలాన్ని శనివారం బాయిలర్ డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్‌బాయిల్డ్ మిల్లులలో ఈ తరహా ప్రమాదాలు చాలా అరుదుగా జరుగుతాయన్నారు. అ యితే బాయిలర్ పేలిపోవడానికి గల కారణాలు తెలియడం లేదని, పేలిపోయిన బా యిలర్‌ను అన్ని విధాలుగా పరిశీలించిన ట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 400ల బాయిలర్లు ఉన్నాయని, ఎక్కడా కూడా ఇంతపెద్ద పేలుడు జరగలేదన్నారు. ప్ర మాద వివరాలను ఒక నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఇన్‌స్పెక్టర్ ఆఫ్ బాయిలర్ శ్రీనివాసరావు ఉన్నారు.
‘పార్‌బాయిల్డ్’ ప్రమాదం
Published Sat, Jun 27 2015 11:35 PM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM
Advertisement
Advertisement