కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి ఈటల రాజేందర్
సాక్షి, హుజురాబాద్‌రూరల్: ఎక్కడ కన్నీళ్లు ఉంటే అక్కడ నేనుంటానని, నేనున్నంత వరకు ఎంత గొప్ప వైద్యమైనా అందించే ప్రయత్నం చేస్తాన ని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం హుజూరాబాద్ పురపాలక సంఘం తొలి సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన మంత్రి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ర్యాలీగా కార్యాలయానికి వెళ్లారు. మున్సిపల్ చైర్మన్ గందె రాధిక శ్రీనివాస్, వైస్ చైర్మన్ కొలిపాక నిర్మల శ్రీనివాస్ తదితరులు మంత్రిని గజమాలతో సన్మానించారు. మంత్రి మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యేగా గెలవడం సు లువని, కౌన్సిలర్‌గా గెలవడం తేలికకాదన్నారు. వార్డు అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో ప్రజలు గెలిపించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు. పట్టణ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు మంజూరు చేయించి అభివృద్ధి చే యించానని తెలిపారు. పట్టణంలో రూ.50 కో ట్ల నిధులతో భగీరథ పనులు మరోమూడునెలల్లో పూర్తవుతాయని తెలిపారు.
నిరుపేదలకు చిరకాల ఆకాంక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను గణేశ్‌నగర్‌లో, బోర్నపల్లిలో నిర్మాణాలు పూర్తి కావచ్చాయని, త్వరలో ప్రజలకు అందిస్తామని తెలి పారు. శివారు కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తామని తెలిపారు. హుజురాబాద్‌లో వందపడకల ఆసుపత్రితో మినీ ఎంజీఎంలా నియోజకవర్గ ప్రజలకు సేవలందిస్తుందని తెలిపారు. రూ.12 వేల కోట్లతో ఆసరా పింఛన్‌లకోసం ప్ర భుత్వం ఖర్చు చేస్తోందని తెలి పా రు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ, ఎంపీపీ ఇరుమల్ల రాణి, జెడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, మార్కెట్ చైర్మన్ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర సహా య కార్యదర్శి బండ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ఈసంపల్లి జోనా, మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment