‘సొంతపార్టీ నేతలే గోచీ ఊడగొడతారు’ | Jagadishwar Reddy takes on ponnala lakshmaiah | Sakshi
Sakshi News home page

‘సొంతపార్టీ నేతలే గోచీ ఊడగొడతారు’

Published Mon, Sep 15 2014 9:35 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

‘సొంతపార్టీ నేతలే గోచీ ఊడగొడతారు’ - Sakshi

‘సొంతపార్టీ నేతలే గోచీ ఊడగొడతారు’

హుజూర్‌నగర్: టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై అవాకులు, చవాకులు పేలుతున్న టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు సొంత పార్టీ నేతల చేతిలోనే పరాభవం తప్పదని, వారే ఆయన గోచీ ఊడగొడతారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ టౌన్‌హాల్‌లో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల కంటే ముఖ్యమంత్రి అదనంగా సంక్షేమ పథకాలను అమలుచేస్తుంటే కాంగ్రెస్ నాయకుల కళ్లు మసకబారిపోయాయని విమర్శించారు. మెదక్ ఎన్నికలను రెఫరెండంగా తీసుకుంటామని, ఓటమి చెందితే రాజీనామా చేస్తామని సవాల్ విసిరితే పొన్నాలలో వణుకుపుట్టిందన్నారు. హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతిందని కేంద్రమాజీ మంత్రి జైపాల్‌రెడ్డి మాట్లాడడం సరికాదని, అక్కడి ప్రజలకు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement