Guntakandla Jagadishwar Reddy
-
సునీల్ మృతికి మంత్రి జగదీశ్‌రెడ్డి సంతాపం
సాక్షి, సూర్యాపేటరూరల్ : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వీ6 రిపోర్టర్ సునీల్ భౌతికకాయాన్ని శుక్రవారం మండలంలోని యర్కారం గ్రామంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. నివాళులర్పించిన వారిలో ఎంపీ బడుగుల లింగయ్యయా దవ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేలు, సూర్యాపేట ఎంపీపీ వట్టె జానయ్యయాదవ్‌తో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. సునీల్ మృతి చెందడం బాధాకరం.. రోడ్డు ప్రమాదంలో కోదాడ వీ6 రిపోర్టర్ సునీల్ మృతి చెందడం బాధకరమని తెంజు రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట మండలం యర్కారం గ్రామంలో నిర్వహించిన సునీల్ అంతిమయాత్రలో సంఘం జిల్లా అధ్యక్షుడు వజ్జె వీరయ్యతో కలిసి ఆయన పాల్గొన్నారు. సునీల్ భౌతికకాయంపై పుష్ఫగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సహకారంతో సునీల్ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే నేతలు ఎండీ.రియాజుద్దీన్, కారింగుల్ అంజన్‌గౌడ్, గోలి విజయ్, గుండేలి శ్రీధర్, శ్రీను, రఘు పాల్గొని సంతాపం తెలిపారు. -
కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే.. బాబుకు వేసినట్లే : మంత్రి జగదీశ్ రెడ్డి
సాక్షి, సూర్యాపేట : కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే చంద్రబాబుకు వేసినట్లేనని.. రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూస్తుంటే దేశంలో కేసీఆర్‌కు తప్ప మరెవరికి ఇంతటి ప్రజామద్దతు లేదన్నారు. ఆదివారం పట్టణంలోని వాణిజ్యభవన్ సెంటర్లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత స్థానం భవన నిర్మాణ రంగానిదే అన్నారు. భవన నిర్మాణ రంగం కార్మికుల పిల్లలకు కల్యాణలక్ష్మితో పాటు డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో పెద్దపీట వేస్తామన్నారు. భవన నిర్మాణ రంగ కార్మికులకు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.6 లక్షలు, వికలాంగులైతే రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. కాంగ్రెస్, టీడీపీ కలిసి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికే వస్తున్నాయన్నారు. తనను మరోసారి గెలిపిస్తే పేట ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందజేస్తామన్నారు. అదే విధంగా గండూరి జానకమ్మ ఇండోర్ స్టేడియంలో ది క్లాత్ మర్చంట్స్ వర్కర్స్ యూనియన్ ఆత్మీయ సమావేశం నిర్వహించిన సమావేశానికి మంత్రి హాజరయ్యారు. అనంతరం పలువురు టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైవి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, గండూరి ప్రకాష్, ఆకుల లవకుశ, శనగాని రాంబాబుగౌడ్, ఉప్పల ఆనంద్, గండూరి కృపాకర్ పాల్గొన్నారు. కాంగ్రెస్, టీడీపీ ఇక కనుమరుగే.. సూర్యాపేటరూరల్ : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమిగా ఏర్పడిన కాంగ్రెస్, టీడీపీ ఇక కనుమరుగు కానున్నాయని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసే భారీగా పార్టీలో చేరుతున్నారని చెప్పారు. ఆదివారం మండలంలోని గాంధీనగర్‌లో ఎంపీపీ వట్టే జానయ్యయాదవ్ నివాసంలో బాలెంల గ్రామానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు పలువురు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. ఈ శాసనసభ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. టీఆర్ఎస్లో చేరిన శివరాత్రి భిక్షపతి, దుండగుల వెంకన్నతో పాటు మరో 50 మందికి టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు వంగాల శ్రీనివాస్‌రెడ్డి, పులగం వెంకట్‌రెడ్డి, మామిడి రవి, టైసన్, రూపని శ్రీను, పల్స నరేష్ తదితరులు పాల్గొన్నారు. బాబు చేతుల్లో కీలుబొమ్మ కాంగ్రెస్ .. చివ్వెంల : చంద్రబాబు నాయుడు చేతులో కాంగ్రెస్ కీలుబొమ్మగా మారిందని ఆపద్ధర్మ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి మండలంలోని బి.చందుపట్ల, పాశ్చతండా గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 2014కు ముందు ఆకలిచావులు ఉండేవని టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ప్రజలు గౌరవంగా బతుకుతున్నారని అన్నారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ తీసుకొచ్చిన ఘనత టీఆర్ఎస్దే అన్నారు. దేశంలో 45వేల కోట్ల రూపాయలు సంక్షేమ రంగం కోసం ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. దేశాన్ని ఉద్దరించామని గొప్పలు చెప్తున్న సోని యాగాంధీ, రాహుల్‌గాంధీకి రాజకీయ భిక్షపెట్టిన ఉత్తరప్రదేశ్‌లోని రెండు వేల గ్రామాల్లో ఇప్పటికీ కరెంట్ లేదన్నారు. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఖరీప్ నుంచి పది నెలల పాటు సాగునీరందిస్తామన్నారు. తెలంగాణకు అడ్డుపడ్డ చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. పేట ప్రజలు మరోసారి తనను ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చి దిద్దుతానన్నారు. కార్యక్రమంలో జెడ్పీ కోఆప్షన్‌సభ్యుడు షేక్‌బాషా, మాజీ ఎంపీపీ రౌతు నర్సింహారావు, పెద్దగట్టు చైర్మన్ శ్రీనివాస్‌యాదవ్, ఆర్ఎస్ఎస్ మండల కన్వీనర్ భూక్యా వెంకటేశ్వర్లు, చందుపట్ల పద్మయ్య, మారినేని సుధీర్‌రావు, వేముల చిన్న, మిర్యాల గోవిందరెడ్డి, వెంకన్న పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు... -
టీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారు : మంత్రి జగదీశ్ రెడ్డి
సాక్షి, పెన్‌పహాడ్ (సూర్యాపేట) : నాలుగున్నరేళ్ల పాలనలో మా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసే ప్రజలు గ్రామాలకు వెళ్తున్న తమకు, టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని సింగారెడ్డిపాలెం, అనంతారం, పొట్లపహాడ్, దూపహాడ్, లింగాల గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ప్రజాదరణను చూసి భయపడిపోయిన ప్రతిపక్షాలు ప్రజాకూటమి పేరుతో జతకట్టాయన్నారు. ప్రజాదరణ ముందు ఈ కూటమి మట్టికొట్టుకుపోనుందని ఎద్దేవా చేశారు. మాకు అధికారమే ముఖ్యం కాదని.. అభివృద్ధే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నాలుగున్నరేళ్లలో సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్లాం.. దేశంలో ఇప్పటివరకు ఎక్కడా జరగని అభివృద్ధి, ఏ రాష్ట్రంలో చేపట్టని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు అవుతున్నాయని తెలిపారు. 14ఏళ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణలో టీఆర్ఎస్తోనే మన బతుకులు మారతాయన్నారు. రైతులు వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టి అప్పుల పాలయ్యారని వ్యవసాయం బతికిస్తేనే ఊర్లు బాగుంటాయని ఉద్దేశంతో రూ.లక్ష రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 24గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని సోనియా, మోదీ రాష్ట్రాల్లో ఎక్కడా ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిందన్నారు. తెలంగాణను దోచుకోవడానికి రెండు ఆంధ్రా పార్టీలు పగటి దొంగలుగా వస్తున్నాయని అన్నారు. టీఆర్ఎస్ అభివృద్ధిని అడ్డుకోవడానికి కాంగ్రెస్‌కు రూ.500కోట్ల ఇచ్చి చంద్రబాబునాయుడు చేతిలో తోలు బొమ్మలుగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఉన్నారని పేర్కొన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి ఎస్సార్ఎస్పీ కాల్వల ద్వారా సాగునీరు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని చంద్రబాబు నాయుడు అడ్డుకునేందుకు 35ఉత్తరాలు రాశారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే చంద్రబాబుకు వేసినట్లే అన్నారు. మహిళలకు బతుకమ్మ చీరలు రాకుండా కాంగ్రెస్ నాయకులే అడ్డుపడ్డారన్నారు. అనంతరం అనంతారం, సింగారెడ్డిపాలెం గ్రామాల్లో వివిధ పార్టీలకు చెందిన వారు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎంపీపీ భుక్యా పద్మ, ఒంటెద్దు నర్సింహారెడ్డి, నెమ్మాది భిక్షం, మారిపెద్ది శ్రీనివాస్, మిర్యాల వెంకటేశ్వర్లు, పుట్ట రేణుకాశ్రీనివాస్‌గౌడ్, దంతాల వాణివెంకన్న, మామిడి అంజయ్య, చిట్టెపు నారాయణరెడ్డి, పొదిల నాగార్జున, సామ వెంకటరెడ్డి, పేర్ల శ్రీధర్, మున్నా వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
నామినేషన్లకు తెర
ముందస్తు ఎన్నికల్లో ఓ అంకానికి తెర పడింది.ఈనెల 12తో ప్రారంభమైన నామినేషన్ల పర్వం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో సోమవారంతోముగిసింది. చివరి రోజు నామినేషన్లతో భారీ ర్యాలీలు, నినాదాలతోనియోజకవర్గ కేంద్రాలు హోరెత్తాయి. ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు భారీగానామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. ఇక ప్రధాన పార్టీల్లో పార్టీ పరంగా అభ్యర్థులు నామినేషన్లు వేస్తే..టికెట్ దక్కక రెబల్స్ కూడా నామినేషన్లు వేశారు. ఒక్క రోజే జిల్లా వ్యాప్తంగా 115 నామినేషన్లు దాఖలయ్యాయి. సాక్షిప్రతినిధి, సూర్యాపేట : నామినేషన్ల ఘట్టం ముగిసింది. చివరి రోజైన సోమవారం పెద్ద ఎత్తున నామినేషన్లు నమోదయ్యాయి. సూర్యాపేట నియోజవకవర్గంలో చివరిరోజు నామినేషన్ల దాఖలు ఆయా పార్టీల శ్రేణుల ర్యాలీలు, ప్రచార హోరుతో జరిగాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు తమకు ఇష్టమైన దేవాలయాల్లో పూజలు చేసి నామినేషన్ల కేంద్రానికి కదిలారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా సంకినేని వెంకటేశ్వర్రావు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాంరెడ్డి దామోదర్‌రెడ్డి భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు. కోదాడలో టీఆర్ఎస్ అభ్యర్థిగా బొల్లం మల్లయ్య యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థిగా నలమాద పద్మావతి, టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డిలు భారీ ర్యాలీ లతో నామినేషన్లు వేశారు. అలాగే హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పట్టణంలో ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. తుంగతుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థిగా అద్దంకి దయాకర్ భారీ ర్యాలీతో నామినేషన్ వేశారు. ఇక పలు పార్టీలనుంచే కాక, స్వతంత్రంగా చాలా మంది అభ్యర్థులు బరిలో నిలవడానికి నామినేషన్లు వేశారు. చివరి రోజు నామినేషన్లతో జిల్లా వ్యాప్తంగా రాజకీయ పార్టీల కోలాహలం కనిపించింది. అన్ని పార్టీల అభ్యర్థులు శ్రేణులు కదలిరావడంతో ఉత్సాహంతో నామినేషన్లు వేసి విజయం తమదేనన్న ధీమాలో అభ్యర్థులు ఉన్నారు. జిల్లాలో ఇప్పటివరకు వచ్చిన మొత్తం నామినేషన్లు: నియోజకవర్గం అభ్యర్థులు నామినేషన్లు హుజూర్నగర్ 24 39 కోదాడ 27 41 సూర్యాపేట 30 58 తుంగతుర్తి 27 42 మొత్తం 108 180 ఏడు రోజుల్లో 108 మంది అభ్యర్థులు..180 నామినేషన్లు.. ఈ నెల 12నుంచి నామినేషన్ల ముగింపు వరకు జిల్లాలో 108 మంది అభ్యర్థులు 180 నామినేషన్లు దాఖలు చేశారు. టికెట్ల ప్రకటన కాకముందే కొంత మంది స్వతంత్రులుగా, పార్టీ పరంగా రెండు, మూడు సెట్లు నామినేషన్లు వేయడంతో అభ్యర్థుల సంఖ్య తక్కువ, నామినేషన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. సోమవారం జిల్లావ్యాప్తంగా నాలుగు నియోజకవర్గాల పరిధిలో115 నామినేషన్లు దాఖలు కాగా ఇందులో హుజూర్నగర్ నియోజకవర్గంలో 23 నామినేషన్లు, కోదాడలో 29, సూర్యాపేటలో అత్యధికంగా 33, తుంగతుర్తిలో 30 నామినేషను వచ్చాయి.. ఇక రెబల్స్ బుజ్జగింపులు.. నామినేషన్ల అంకం ముగియడంతో పార్టీల తరఫున బీఫామ్‌లతో నామినేషన్లు వేసిన వారు.. ఇక రెబల్స్‌పై దృష్టి పెట్టారు. ఈనెల 22 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. అయితే ఈలోపే వారిని బుజ్జగించి బరిలో ఉండకుండా చూసేలా రాజకీయ మంతనాలకు దిగుతున్నారు. రెబల్స్‌గా వేసిన అభ్యర్థులకు వారి కుటుంబంలో దగ్గర ఉన్న వ్యక్తులు ఎవరు..?, పార్టీ పరంగా ఏ నాయకుడు చెబితే వింటారోనని బుజ్జగించేందుకు అన్ని దారులు పార్టీల అభ్యర్థులు వెతుకుతున్నారు. బుజ్జగింపులకు వినకుంటే చివరికి వారి వల్ల ఎంత నష్టం జరుగుతుందో కూడా అభ్యర్థులు అంచనాల్లో మునిగారు. వారికి ఏ మండలం, గ్రామం, పట్టణంలో వారికి ఎన్ని ఓట్లు పడతాయో కూడా లెక్కలు వేయిస్తున్నారు. దీని ఆధారంగా వారు వినకుంటే వారి వెంట ఉన్న ద్వితీయ శ్రేణి నేతలకు ఎర వేసి తమ వైపునకు లాక్కునే ప్రయత్నాల్లో ఉన్నారు. -
పథకాల అమలులో మనమే నంబర్‌వన్
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, హోంమంత్రి నాయిని నర్సిం హారెడ్డి అన్నారు. దేవరకొండలో ఆదివారం జరిగిన టీఆర్ఎస్ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే అభివృద్ధి పథకాలు ఆగిపోతాయన్నారు. అదే విధంగా నల్లగొండలో జరిగిన టీఆర్ఎస్ సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. అనంతరం ఈనెల 4న జరగనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభా ఏర్పాట్లను పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. దేవరకొండ (నల్లగొండ రూరల్): దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం నంబర్‌వన్‌గా నిలిచిందని మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం దేవరకొండలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలతో పాటు లేని హామీలను సైతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు టీఆర్ఎస్ అభ్యర్థులను ఎదుర్కొనే శక్తి లేదని, మహాకూటమి పేరుతో ప్రజలను మభ్యపెట్టేం దుకు వస్తున్నారని, ప్రజలు గమనించా లన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎడారిగా మారడానికి కారణం కాంగ్రెస్ పార్టీ్టయేనని, ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపివేయాలని కేసులు వేస్తూ ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారని ఆరోపించారు. అనంతరం ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌లు మాట్లాడుతూ రాను న్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజా ర్టీతో గెలిపించి దేవరకొండ ఖిల్లాపై గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. అం తకుముందు భారీ ర్యాలీగా సమావేశ ప్రాంతానికి చేరుకున్న మంత్రులకు టీఆర్ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నార్మాక్స్ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, దేవరకొండ ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్, మార్కెట్ చైర్మన్ బండారు బాలనర్సింహ, తేర గోవర్ధన్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మారుపాకుల సురేష్‌గౌడ్, నల్లగాసు జాన్‌యాదవ్, గాజుల ఆంజనేయులు, నేనావత్ రాంబాబు, హన్మంతు వెంకటేశ్‌గౌడ్, పున్న వెంకటేశ్, ముత్యాల సర్వయ్య, ముక్కమల వెంకటయ్య, ఏడ్పుల గోవిందు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కారు గుర్తుకే ఓటు వేయాలి నల్లగొండ రూరల్ : రాష్టానికి పట్టిన శని పోవాలంటే ప్రజలంతా కారు గుర్తుకు ఓటు వేయాలని మంత్రి జగదీశ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం టీఆర్ఎస్ నల్లగొండ మండల కమిటీ సర్వసభ్య సమావేశం బైపాస్‌లోని ఎంఎన్ఆర్ గార్డెన్లో నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడారు. 60ఏళ్లు రాష్టాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీలు రాష్టాన్ని నాశనం చేశాయని ఆరోపించారు. జిల్లా తలాపున కృష్ణానది పారుతున్నా సాగునీరు లేదు..కనీసం తాగునీరు అందివ్వకపోగా రోగాలను, ఫ్లోరోసిస్ అందించారని, పైగా జిల్లానే ఎడారిగా మార్చారని విమర్శించారు. నల్లగొండ నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కారుగుర్తుకు ఓటు వేయాలన్నారు. రైతు సమన్వయసమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి,ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ నల్లగొండకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శని అన్నారు. పార్టీ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి చేసి చూపిస్తా ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈసమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడకిషన్ రెడ్డి, పార్టి మండల, పట్టణ అధ్యక్షుడు బకరం వెకంన్న, అబ్బగోని రమేష్‌గౌడ్, ఐసీడీఎస్ కోఆర్డినేటర్ శరణ్యరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రేఖల భద్రాద్రి, మార్కెట్ చైర్మన్ ఖరీంపాష, ఎంపీపీ దైద రజితా వెంకట్‌రెడ్డి, బక్కపిచ్చయ్య, కట్టశ్రీను, జిల్లా శంకర్, దేపవెంకట్ రెడ్డి, రాజ్‌పేట మల్లేష్‌గౌడ్, గాదె రాంరెడ్డి, కె.సత్యనారాయణ, బోయపల్లి కృష్ణారెడ్డి, రవీందర్ రెడ్డి, బడుపుల శంకర్, అండాలు గట్టయ్య పాల్గొన్నారు. సీఎం సభాస్థలాన్ని పరిశీలించిన మంత్రి నల్లగొండ రూరల్ : ఈనెల 4న నల్లగొండ బైపాస్‌లోని ఎంఎన్ఆర్ గార్డెన్ వద్ద నిర్వహించే సీఎం కేసీఆర్ ఆశీర్వాద బహిరంగ సభ ఏర్పాట్లను ఆదివారం మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడారు. కొంగరకలాన్ సభకు వెళ్లలేని వారంతా సీఎం సభకు వచ్చేందుకు ఉత్సాహంగా ఉన్నారని, జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమావేశాలను చూస్తుంటే ఎన్జీ కాలేజి స్థలం సరిపోదని బైపాస్కు మార్చినట్లు తెలిపారు. -
ఉమ్మడి జిల్లాలో గులాబీ జెండా ఎగురవేస్తాం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ జెండా జయకేతనం ఎగురవేస్తుందని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలో వివిధ పార్టీలకు చెందిన సుమారు 500 మంది టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. 12 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో గెలుపుఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ జెండా జయకేతనం ఎగురవేస్తోందని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వివిధ పార్టీలకు చెందిన సుమారు 500 మంది టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. 12 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు గెలుపుఖాయమన్నారు. ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారని తేల్చిచెప్పారు. ప్రజలు మంచి చెడును గమనిస్తున్నారని, చెడును తుంగలో తొక్కడం ఖాయమన్నారు. సిండికేట్ వ్యాపారాలను ప్రోత్సహించిన వారికి గుణపాఠం తప్పదన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపట్ల తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుందని హెచ్చరించారు. దొంగలు..దొంగలు.. కలిసి ఊర్లు తిరుగుతున్నారని, వాళ్లకు ప్రజా వ్యతిరేకత తప్పదన్నారు. గత ఎన్నికల్లో సిగ్గు లేకుండా తిట్టుకున్న వారే కలిసి తిరుగుతుంటే సూర్యాపేట ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో రూ.2468 కోట్ల అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. రబీలో సాగర్ జలాలలతో రెండో పంటను అందుకున్న రైతులు ఆనందం పడుతుంటే సాగర్ ఎమ్మెల్యే జానారెడ్డి మాత్రం చివరి భూములకు నీళ్లు కావాలని కోరడం ఏంటని ప్రశ్నించారు. జానారెడ్డి చివరి భూముల్లో తిరుగుతుండడం చూస్తుంటే ఆయనతో పనిచేయించినట్లుగా తనకు ఆనందంగా ఉందన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో వార్డులు పర్యటిస్తున్న దామోదర్‌రెడ్డి గతంలో పర్యటించి అభివృద్ధి చేస్తే బాగుండేదన్నారు. ఇప్పటికైనా ఎన్ని వార్డులు తిరిగినా అవసరమైన పనులు చూపిస్తే అభివృద్ధి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నమన్నారు. కలెక్టరేట్ నిర్మాణం, ఎస్పీ కార్యాలయ నిర్మాణం, రోడ్ల వెడల్పు, కమ్యూనిటీ హాళ్లు, సద్దుల చెరువు మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దేందుకు ’20కోట్లు ఖర్చు చేశామన్నారు. పుల్లారెడ్డి చెరుకు కోసం రూ.12 కోట్లు మంజూరయ్యాని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా మెడికల్ కళాశాల సూర్యాపేటకు మంజూరు చేయించిన ఘనత తమదేనన్నారు. అభివృద్ధికి మరోసారి ప్రజలు పట్టం కట్టనున్నారని చెప్పారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శ్రీనివాస్, తాహేర్‌పాషా, బూరబాల సైదులు, మహేశ్వరి, రమణ, నర్సింహారావు, బాషా, శ్రీనివాస్, యాదగిరి పాల్గొన్నారు. -
‘సొంతపార్టీ నేతలే గోచీ ఊడగొడతారు’
హుజూర్నగర్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై అవాకులు, చవాకులు పేలుతున్న టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు సొంత పార్టీ నేతల చేతిలోనే పరాభవం తప్పదని, వారే ఆయన గోచీ ఊడగొడతారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా హుజూర్నగర్ టౌన్హాల్లో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల కంటే ముఖ్యమంత్రి అదనంగా సంక్షేమ పథకాలను అమలుచేస్తుంటే కాంగ్రెస్ నాయకుల కళ్లు మసకబారిపోయాయని విమర్శించారు. మెదక్ ఎన్నికలను రెఫరెండంగా తీసుకుంటామని, ఓటమి చెందితే రాజీనామా చేస్తామని సవాల్ విసిరితే పొన్నాలలో వణుకుపుట్టిందన్నారు. హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతిందని కేంద్రమాజీ మంత్రి జైపాల్‌రెడ్డి మాట్లాడడం సరికాదని, అక్కడి ప్రజలకు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.