మంత్రి జగదీశ్ రెడ్డి(పాత చిత్రం)
సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వస్తే ఏమి వస్తుందన్న వారికి కంటికి కనిపించేలా ఆంధ్రా ప్రాంతానికి చుక్క నీరు కూడా పోకుండా చివరి ఆయకట్టు వరకు నీరందించడం హుజూర్‌నగర్ ప్రజలు చూశారని మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. హుజూర్ నగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ..మతసామరస్యానికి ప్రతీక తెలంగాణ రాష్ట్రమని తెలిపారు. పరిసరాలు బాగుంటేనే పర్యావరణం బాగుంటుందని అన్నారు.
పేద ముస్లింలను దృష్టిలో పెట్టుకుని బట్టల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని వెల్లడించారు. హిందూ క్రిస్టియన్ అనే బేధాలు లేకుండా వారి పండుగలకు తెలంగాణ ప్రభుత్వం కానుకలు అందజేస్తోందని, అలాగే అన్ని రకాల మతాల వారిని గౌరవంగా చూసుకోవడం సీఎం కేసీఆర్ గొప్పతనమని వ్యాఖ్యానించారు. గత పాలకులు ముస్లింలను ఓటు బ్యాంకుగానే వాడుకున్నారు..కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం వారి అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు.
మైనార్టీల కోసం 200 పాఠశాలలు ప్రారంభించి వారిలో పేదవారికి మేలు జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ముస్లింల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రైతు బంధు పథకం కింద రైతులకి సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా చెక్కులు పంపిణీ చేశారని, అలాగే 50 లక్షల మంది రైతులకు బీమా చేస్తున్నదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment