మొక్కల సంరక్షణకు దాతలు చేయూతనందించాలి | doners help to plants protection | Sakshi
Sakshi News home page

మొక్కల సంరక్షణకు దాతలు చేయూతనందించాలి

Published Tue, Jul 19 2016 10:41 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

మొక్కల సంరక్షణకు దాతలు చేయూతనందించాలి

మొక్కల సంరక్షణకు దాతలు చేయూతనందించాలి

హుజూర్‌నగర్‌ : హరితహారంలో భాగంగా నాటిన మెుక్కల సంరక్షణకై ట్రీగార్డుల ఏర్పాటుకు దాతలు చేయూతనందించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అల్లం ప్రభాకర్‌రెడ్డి కోరారు. మంగళవారం పట్టణంలోని 9వ వార్డులో నిర్వహించిన హరితహారంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. అదే విధంగా పట్టణంలోని 19, 20 వార్డుల్లో నిర్వహించిన హరితహారంలో నగరపంచాయతీ చైర్మన్‌ జక్కుల వెంకయ్య, వైస్‌ చైర్మన్‌ దొంతగాని శ్రీనివాస్‌గౌడ్‌లు, స్థానిక కౌన్సిలర్‌ బెల్లంకొండ లలిత, నందిగామ అనితలతో కలిసి మొక్కలు నాటారు. మండలంలోని లింగగిరి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వైద్యాధికారి అబ్దుల్‌ అలీం, సిబ్బంది మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో కమిషనర్‌ బి.సత్యనారాయణరెడ్డి, కౌన్సిలర్లు తేజావత్‌ రవినాయక్, కంకణాల పుల్లయ్య, యల్లావుల సీత, రిటైర్డ్‌ హెచ్‌ఎం ఎంఎస్‌ఎన్‌.రాజు నాయకులు బెల్లంకొండ శ్రీనివాస్, నందిగామ శంభయ్య, సైదులునాయక్, వసంతకుమార్, యోహాన్, శోభన్‌ బాబు, చంటి, గురునాథం, వైద్యసిబ్బంది  జాన్‌బాషా, రాజేంద్రప్రసాద్, పార్వతి, రామకృష్ణ, ఉపేందర్, జ్యోతి, నర్సింహారావు, సంతోషి, సలోమి, లక్ష్మమ్మ, శ్రీను పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement