Published
Fri, Sep 9 2016 11:35 PM
| Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా మార్చాలి
హుజూర్‌నగర్ : నియోజకవర్గ కేంద్రమైన హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ నాయకులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఏదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో చేర్చిన కోదాడ రెవెన్యూ డివిజన్‌ను వెంటనే రద్దు చేయాలన్నారు. అన్ని అర్హతలున్న హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఎందుకు ఏర్పాటు చేయడం లేదో స్పష్టత ఇవ్వాలన్నారు. హుజూర్‌నగర్ పాత తాలుకాగా ఉండటంతో పాటు అన్ని శాఖలకు సంబంధించిన డివిజనల్ కార్యాలయాలు, రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా మోడల్ కోర్టు, మోడల్ సబ్ జైలు, సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయన్నారు. రెవిన్యూ డివిజన్ సాధనే లక్ష్యంగా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ నాయకులు గల్లా వెంకటేశ్వర్లు, ఎండి.అజీజ్‌పాషా, చింతిర్యాల నాగయ్య, రెడపంగు పెదవెంకటేశ్వర్లు, గొల్లగోపు వెంకటేశ్వర్లు, కస్తాల ముత్తయ్య, కస్తాల శ్రావణ్‌కుమార్, నందిగామ ముక్కంటి, బరిగెల చంద్రశేఖర్, ఎస్‌కె.అన్వర్‌పాషా, కుంభం శివ, జి. మట్టయ్య పాల్గొన్నారు.