హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలి
హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలి
Published Fri, Sep 30 2016 11:20 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
హుజూర్‌నగర్ : తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక రెవెన్యూ కలిగిన హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద 17వ రోజు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన, ఆయకట్టుగా ఉన్న హుజూర్‌నగర్ అన్ని విధాలుగా రెవెన్యూ డివిజన్‌కు అర్హత కలిగి ఉందన్నారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు చేపట్టిన ఉద్యమానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. త్వరలో జరిగే అఖిలపక్ష సమావేశంలో తమపార్టీ తరపున హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలని కోరనున్నట్లు తెలిపారు. కాగా ఈదీక్షలలో మాధవరాయినిగూడెం అంబేద్కర్ సంక్షేమ సంఘం నాయకులు నందిగామ ముక్కంటి, శ్రీనివాస్, సైదులు, దావీద్, నాగరాజు, రాములు, వెంకటేష్, వీరబాబు, రవిలు పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకులు వేముల శేఖర్‌రెడ్డి, కస్తాల ముత్తయ్య, మందా వెంకటేశ్వర్లు, పిల్లి మరియదాసు, పట్టణ, మండల అధ్యక్షులు గుర్రం వెంకటరెడ్డి, జడ రామకృష్ణ, నేరేడుచర్ల మండల అధ్యక్షులు కుందూరు మట్టారెడ్డి, పట్టణ, మండల మహిళా అధ్యక్షులు కారింగుల మంగమ్మ, పశ్య మల్లేశ్వరి, రామకృష్ణారెడ్డి, బొమ్మకంటి వెంకటేశ్వర్లు, పిల్లిమల్లయ్య, దాసరి రాములు, ముసంగి శ్రీను, మోహన్‌రెడ్డి, మహ్మద్‌సాబ్, పాతర్ల పాటిలక్ష్మి, విజయ, అప్పారావు, సురేందర్‌రెడ్డి, రెవెన్యూ డివిజన్ సాధనకమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement