అశాస్త్రీయంగా పునర్విభజన
అశాస్త్రీయంగా పునర్విభజన
Published Sun, Sep 18 2016 7:34 PM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM
హుజూర్‌నగర్ : తెలంగాణ ప్రభుత్వం జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజనను అశాస్త్రీయంగా చేపడుతూ ప్రతిపక్షాలను పట్టించుకోవడంలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో 5 రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని సందర్శించిన ఆయన కొద్దిసేపు దీక్ష శిబిరంలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలు, ప్రతిపక్షాల కోరికలను బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఇందుకు గాను రాష్ట్ర ప్రతిపక్ష నాయకుని హోదాలో హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా సాధించేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. అనంతరం సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ సాధన కమిటీనాయకులు అజీజ్‌పాషా, గల్లావెంకటేశ్వర్లు, చింతి ర్యాలనాగయ్య, కస్తాల శ్రావణ్, రెడపంగ పెదవెంకటే శ్వర్లు, నందిగామ ముక్కంటి, ఇట్టిమళ్ల బెంజిమన్, దాసరి నరేందర్, దాసరి పున్నయ్య, మట్టయ్య, మందా వెంకటేశ్వర్లు, కస్తాల ముత్తయ్య, రామారావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement