పాఠశాలను సందర్శించిన న్యూజిలాండ్ దేశస్తులు
హుజూర్‌నగర్ :
పట్టణ పరి«ధిలోని మఠంపల్లి రోడ్డులో గల దుర్గాభవాని పాఠశాలను మంగళవారం న్యూజిలాండ్ దేశస్తులు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ పశ్య కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ న్యూజిలాండ్ దేశానికి చెందిన ఒక బృందం రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేయబడిన పలు పాఠశాలలను సందర్శిస్తున్నారన్నారు. పాఠశాలల్లో విద్యావిధానం, సిలబస్, వసతులు,ఫీజులు తదితర అంశాలను పరిశీలించి అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నూతన సిలబస్ విధానాన్ని ప్రవేశపెట్టి విద్యార్థులకు విద్యనందించడం పట్ల యాజమాన్యాన్ని అభినందించారన్నారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ పి.కోటిరెడ్డి, ఇంఛార్జ్ పులి బాలకృష్ణ పాల్గొన్నారు.