ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన రాష్ట్ర బృందం
హుజూర్‌నగర్ : పట్టణంలోని సీతారాంనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మంగళవారం రాష్ట్ర పరిశీలక బృందం సందర్శించింది. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను, రికార్డులను తనిఖీ చేసి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు.
హుజూర్‌నగర్ : పట్టణంలోని సీతారాంనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మంగళవారం రాష్ట్ర పరిశీలక బృందం సందర్శించింది. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను, రికార్డులను తనిఖీ చేసి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు మెనూ ప్రకారం భోజనం అందజేయాలని సూచించారు. ప్రహరీగోడ, మరుగుదొడ్లు, వంటగది నిర్మాణం విషయమై అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలక బృందం సభ్యులు సతీష్‌బాబు,షేక్ మహæ్మద్, హెచ్‌ఎం విజయలక్ష్మి, ఉపాధ్యాయులు రామ్మూర్తి, రేణుక, ఎస్‌ఎంసీ చైర్మన్ లింగరాజు, సీఆర్‌పీలు సైదులు, సల్మా పాల్గొన్నారు.