నల్గొండ : నల్గొండ జిల్లా హుజూర్నగర్ శివారు ప్రాంతంలో ఆటోలో తరలిస్తున్న ఎర్రచందనాన్ని పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనాన్ని సీజ్ చేసి ఆటోను పోలీస్ స్టేషన్కి తరలించారు. ఆటో డ్రైవర్లను పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. పట్టుబడిన ఎర్రచందనం దుంగలు 8 క్వింటాళ్ల వరకు ఉంటాయని పోలీసులు చెప్పారు.