ఎంత రీచార్జ్ కార్డు కొంటే అంతే వాడకం
మొదట దఫా ప్రభుత్వ కార్యాలయాల్లో మీటర్ల ఏర్పాటు
విద్యుత్‌దుబారాకు చెక్ పెట్టేందుకే కొత్త విధానం
హుజూర్‌నగర్ : ఇక నుంచి కరెంట్ వినియోగించాలంటే రీచార్జ్ చేయించాల్సిందే.. ఇదేమిటని ఆశ్చర్యపోతున్నారా.. అవును నిజమే మరీ. సెల్‌ఫోన్‌ల మాదిరిగా రీచార్జ్ కార్డులు ఎప్పటి కప్పుడు కొనుగోలు చేయాల్సిందే. కరెంట్ దుబారాను అరికట్టేందుకు పాలకులు నడుం బిగించారు. మొదటి దఫా ప్రభుత్వ కార్యాలయాల్లోనే మీటర్లు విధానం ఇదీ..
ఇవి సెల్‌ఫోన్ రీచార్జ్ విధానంలాగా ఉండడంతో ఎంత రీచార్జ్‌కార్డు కొంటే అంతే విద్యుత్ వినియోగించుకోవచ్చు. ముందుగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ మీటర్లను ఏర్పాటు చేయాలని అధికారులు సిద్ధమయ్యారు. ఆయా కార్యాలయాలకు ప్రతినెలా వచ్చే విద్యుత్‌బిల్లుల ఆధారంగా రూ.1000 నుంచి రూ.20 వేల వరకు రీచార్జ్ విద్యుత్ కార్డులను ప్రత్యేక కౌంటర్లలో విక్రయించనున్నారు. ఈ కార్డులను ఆయా ప్రభుత్వ కార్యాలయాల అధికారులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆయా కార్యాలయాలకు ఇచ్చిన ప్రీపెయిడ్ కార్డు విలువ ఆధారంగా విద్యుత్ సరఫరా జరిగి కార్డు విలువ పూర్తికాగానే ఆటోమేటిక్‌గా విద్యుత్ సరఫరా> నిలిచిపోతుంది. దీంతో తిరిగి రీచార్జ్ చేయించుకోగానే ఆటోమేటిక్‌గా కరెం టు సరఫరా జరుగుతుంది. ఈ వి«ధా నం ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ దుబారాకు నూరు శాతం అడ్డుకట్ట వేసేందుకు చక్కటి మార్గంగా నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్ బిల్లుల బకాయిలు ఏడాదికేడాది పెరిగి పోతుండటంతో విద్యుత్ రంగసంస్థలకు నష్టాలు వస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది రూపాయలు మొండిబకాయిలుగా మిగిలి పోవడంతో నూతన విధానాన్ని ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు.
విద్యుత్ దుబారాను తగ్గించి బకాయిలు పెరగకుండా అడ్డుకట్ట వేసేందుకు ఈ విధానం ఒక్కటే మార్గమని భావించిన విద్యుత్ రంగ నిపుణుల సలహాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ముందుగా పట్టణాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ కార్యాలయాల సంఖ్య ఆధారంగా వాటిని ఆయా విద్యుత్ డివి జన్లకు పంపిణీ చేస్తున్నారు. ఉమ్మడి జి ల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరిలలో అత్యధికంగా ప్రభుత్వ కార్యాలయాలు ఉండటంతో సర్వీస్‌లు ఎక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాల పరిధిలో 3,445 ప్రభు త్వ కార్యాలయాలు, 2214 పాఠశాల లు, 211 కేంద్ర ప్రభుత్వ కార్యాలయా లు, 1312 మున్సిపల్ కార్యాలయా లు, 8,556 గ్రామపంచాయతీల వీధిలైట్ల సర్వీస్‌లకు దఫాల వారీగా ముం దస్తుగా ఈ ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పా టు చేయనున్నారు. అయితే మొదటి దఫాగా ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటు చేసేందుకు విద్యుత్ అధికారు లు,సిబ్బంది సన్నద్ధమవుతున్నారు. మొద టి దఫాగా ప్రభుత్వ కార్యాలయాలకు ఏర్పాటు చేస్తున్న ఈ మీటర్లు విజయవంతంగా నడిచినట్లయితే రానున్న రో జుల్లో అన్ని గ్రామాల్లోని సర్వీస్‌లకు కూడా ఈ తరహా విధానాన్ని అమలు చేసే అవకాశం ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు.
ప్రీపెయిడ్ కరెంట్
Published Mon, Jan 2 2017 1:45 AM | Last Updated on Tue, Sep 5 2017 12:08 AM
Advertisement
Advertisement