rechargeable card
-
ప్రీపెయిడ్ కరెంట్
ఎంత రీచార్జ్ కార్డు కొంటే అంతే వాడకం మొదట దఫా ప్రభుత్వ కార్యాలయాల్లో మీటర్ల ఏర్పాటు విద్యుత్దుబారాకు చెక్ పెట్టేందుకే కొత్త విధానం హుజూర్నగర్ : ఇక నుంచి కరెంట్ వినియోగించాలంటే రీచార్జ్ చేయించాల్సిందే.. ఇదేమిటని ఆశ్చర్యపోతున్నారా.. అవును నిజమే మరీ. సెల్ఫోన్ల మాదిరిగా రీచార్జ్ కార్డులు ఎప్పటి కప్పుడు కొనుగోలు చేయాల్సిందే. కరెంట్ దుబారాను అరికట్టేందుకు పాలకులు నడుం బిగించారు. మొదటి దఫా ప్రభుత్వ కార్యాలయాల్లోనే మీటర్లు విధానం ఇదీ.. ఇవి సెల్‌ఫోన్ రీచార్జ్ విధానంలాగా ఉండడంతో ఎంత రీచార్జ్కార్డు కొంటే అంతే విద్యుత్ వినియోగించుకోవచ్చు. ముందుగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ మీటర్లను ఏర్పాటు చేయాలని అధికారులు సిద్ధమయ్యారు. ఆయా కార్యాలయాలకు ప్రతినెలా వచ్చే విద్యుత్‌బిల్లుల ఆధారంగా రూ.1000 నుంచి రూ.20 వేల వరకు రీచార్జ్ విద్యుత్ కార్డులను ప్రత్యేక కౌంటర్లలో విక్రయించనున్నారు. ఈ కార్డులను ఆయా ప్రభుత్వ కార్యాలయాల అధికారులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆయా కార్యాలయాలకు ఇచ్చిన ప్రీపెయిడ్ కార్డు విలువ ఆధారంగా విద్యుత్ సరఫరా జరిగి కార్డు విలువ పూర్తికాగానే ఆటోమేటిక్‌గా విద్యుత్ సరఫరా> నిలిచిపోతుంది. దీంతో తిరిగి రీచార్జ్ చేయించుకోగానే ఆటోమేటిక్‌గా కరెం టు సరఫరా జరుగుతుంది. ఈ వి«ధా నం ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ దుబారాకు నూరు శాతం అడ్డుకట్ట వేసేందుకు చక్కటి మార్గంగా నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్ బిల్లుల బకాయిలు ఏడాదికేడాది పెరిగి పోతుండటంతో విద్యుత్ రంగసంస్థలకు నష్టాలు వస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది రూపాయలు మొండిబకాయిలుగా మిగిలి పోవడంతో నూతన విధానాన్ని ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ దుబారాను తగ్గించి బకాయిలు పెరగకుండా అడ్డుకట్ట వేసేందుకు ఈ విధానం ఒక్కటే మార్గమని భావించిన విద్యుత్ రంగ నిపుణుల సలహాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ముందుగా పట్టణాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ కార్యాలయాల సంఖ్య ఆధారంగా వాటిని ఆయా విద్యుత్ డివి జన్లకు పంపిణీ చేస్తున్నారు. ఉమ్మడి జి ల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరిలలో అత్యధికంగా ప్రభుత్వ కార్యాలయాలు ఉండటంతో సర్వీస్‌లు ఎక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాల పరిధిలో 3,445 ప్రభు త్వ కార్యాలయాలు, 2214 పాఠశాల లు, 211 కేంద్ర ప్రభుత్వ కార్యాలయా లు, 1312 మున్సిపల్ కార్యాలయా లు, 8,556 గ్రామపంచాయతీల వీధిలైట్ల సర్వీస్‌లకు దఫాల వారీగా ముం దస్తుగా ఈ ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పా టు చేయనున్నారు. అయితే మొదటి దఫాగా ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటు చేసేందుకు విద్యుత్ అధికారు లు,సిబ్బంది సన్నద్ధమవుతున్నారు. మొద టి దఫాగా ప్రభుత్వ కార్యాలయాలకు ఏర్పాటు చేస్తున్న ఈ మీటర్లు విజయవంతంగా నడిచినట్లయితే రానున్న రో జుల్లో అన్ని గ్రామాల్లోని సర్వీస్‌లకు కూడా ఈ తరహా విధానాన్ని అమలు చేసే అవకాశం ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు. -
‘కూపన్’తో కూపీ లాగారు..
దొంగలను పట్టించిన గీకి పడేసిన రీచార్జ్ కార్డు సేమియూ పెట్టి నగలు ఎత్తుకెళ్లిన కేసులో కీలకంగా పని చేసిన క్లూ చిక్కుముడి విప్పిన ఎస్సై రవీందర్ వరంగల్ క్రైం : చిన్న క్లూ.. అదిఎంతటి పెద్ద కేసునైనా ఛేదించేందుకు పోలీసులకు ఒక్కో సందర్భంలో ఉపయోగపడొచ్చు. ఎంతటి నేరస్తుడైనా నేరానికి పాల్పడే హడావుడిలో ఏదో ఒకటి జారవిడుచుకుంటాడు.. చివరికి నేరస్తుడు వాడిపడేసిన పనికిరాని వస్తువు కూడా పోలీసులకు దారి చూపుతుంది. ఇటీవల వరంగల్ నగరంలోని శివనగర్‌లో వృద్ధదంపతులకు సేమియా ఇచ్చి నగలు ఎత్తుకెళ్లిన దొంగల విషయంలోనూ ఇదే జరిగింది. గదిలో తమకు సంబంధించిన ఒక్క ఆధారం దొరకకుండా నిందితులు తీసుకెళ్లడంతో కేసు మిస్టరీని ఛేదించడం పోలీసులకు సవాల్‌గా మారిన సమయంలో అక్కడే వాకిట్లో లభించిన గీకి పారేసిన రీచార్జ్ కూపన్ తిరుగులేని ఆధారాన్నిచ్చింది. కూపన్ సాయంతోనే పోలీసులు కూపీ లాగి నిందితులను పట్టుకోగలిగారు. కేసు వివరాల్లోకి వెళితే.. శివనగర్‌లో వృద్ధ దంపతులకు సేమియాలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి ఇళ్లు గుల్ల చేసిన విషయం తెలిసిందే. భార్యాభర్తల పేరుతో వారింట్లో 20 రోజుల క్రితం అద్దెకు దిగిన వారిద్దరు ఈ నెల 12న రాత్రి తమ పెళ్లి రోజని నమ్మించి యజమానులైన వృద్ధ దంపతులకు సేమియాలో మత్తు మందు కలిపి ఇచ్చారు. వారు మత్తులోకి జారగానే ఒంటిమీదున్న నగలతో పాటు టీవీ, డీవీడీ, సెల్ఫోన్లు ఎత్తుకెళ్లారు. చోరీకి సంబంధించి పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. వారు తమ వస్తువులను చీపురుపుల్లతో సహా తీసుకెళ్లారు. వారు తమ సెల్‌నంబర్లు, అడ్రస్ తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. క్లూ దొరికిందిలా... ముందస్తు పథకం ప్రకారం ఎలాంటి వస్తువులు ఇంట్లో వదలకుండా తీసుకెళ్లిన దొంగ దంపతులు హాయిగా తమ స్వగ్రామం చేరుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. నగరంలో కొత్త తరహాలో దొంగతనం జరగడంతో పోలీసులు దొంగల ఆచూకీ తెలుసుకోవడానికి నానాతంటాలు పడాల్సి వచ్చింది. ఆధారాల కోసం వారు కిరాయికి ఉన్న ఇంట్లో అంతా వెతికారు. ఎక్కడా ఎలాంటి క్లూ లభించలేదు. చివరికి చిన్న క్లూ దొరికింది. అదేమిటంటే గీకి పారేసిన చిన్న రీచార్జ్ కూపన్. సదరు దొంగ తన సెల్లో బాలెన్స్ కోసం రీచార్జ్ కూపన్‌ను సమీపంలోని ఒక షాపు నుంచి కొనుగోలు చేశాడు. ఆ రీచార్జ్ కార్డులోని బాలెన్స్ వేసుకుని కార్డును ఇంటి ఆవరణలోనే పడేశాడు. ఇది పోలీసుల కంట పడింది. కూపన్ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. సదరు కంపెనీ సెంటర్ సాయంతో రీచార్జ్ కార్డ్‌లోని అంకెల ఆధారంగా అవి ఏ నంబర్‌కు రీచార్జ్ అయ్యాయో తెలుసుకున్నారు. తర్వాత సెల్‌నంబర్‌ను టవర్ లొకేషన్‌కు పెట్టారు. టవర్ లొకేషన్ చూపించిన విధంగా పోలీసులు సదరు దొంగ దంపతులు గుంటూరు జిల్లాలో ఉన్నట్లు తెలుసుకున్నారు. మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ నుంచి ప్రత్యేక బృందం వారి ఆచూకీ కోసం గుంటూరుకు వెళ్లింది. స్థానిక పోలీసులకు విషయం చెప్పి తమ పనిలో నిమగ్నమయ్యారు. టవర్ లొకేషన్ ప్రకారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండల కేంద్రంలోని సీతమ్మవారి పేటలో వారు ఉన్నట్లు సెల్ లొకేషన్ చెబుతోంది. అయితే వారిని గుర్తుపట్టేందుకు పోలీసులు స్థానికంగా చూసిన వారిని తీసుకెళ్లారు. సీతమ్మవారిపేటలో మద్యం కోసం దొంగ బార్ షాపునకు రాగా అతడిని గుర్తించిన శివనగర్ వాసి పోలీసులకు చూపించాడు. తర్వాత దొంగ ఇంటికి వెళ్తున్న క్రమంలో పోలీసులు అతడిని అనుసరించారు. సంపన్నుల కాలనీలో ఉంటున్న ఆ దొంగలను పట్టుకునేందుకు చూస్తుండగానే వారు మళ్లీ దొంగతనం చేయడానికి వరంగల్‌కు వస్తున్నారనే సమాచారం తెలుసుకున్నారు. ఈ క్రమంలో వారిని వెంబడించి గవిచర్ల వద్ద పట్టుకుని విచారించారు. తాము చేసిన నేరాన్ని ఒప్పుకున్న దొంగలు చోరీ సొత్తును అప్పగించారు. విచారణలో వారిద్దరు అసలు దంపతులు కారని, దొంగతనం కోసం ఒకటై ఇదే వృత్తిగా కొనసాగుతున్నట్లు తెలిసింది. నేర పరిశోధనలో ఇటీవల మిల్స్‌కాలనీ సెకండ్ ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన రవీందర్ విశేషంగా కృషి చేసి అధికారుల మెప్పుపొందారు.