Published
Fri, Sep 2 2016 6:58 PM
| Last Updated on Mon, Oct 1 2018 6:33 PM
శాంతి కమిటీ సమావేశం
హుజూర్‌నగర్ : గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, బక్రీద్ వేడుకలను ఘనంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి సూచించారు. శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వివిధ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో జరిగిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గణేష్ ఉత్సవ కమిటీలు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. మండపాల వద్ద డీజేలకు అనుమతి లేదని తెలిపారు. గణేష్ విగ్రహాల వద్ద మైక్ ఏర్పాటుకు మీ–సేవలో చలానా చెల్లించి పోలీస్ స్టేషన్‌లో దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలన్నారు. ఈ సందర్భంగా ఈద్గా వద్ద మౌలిక వసతులు కల్పించాలని పలువురు నాయకులు నగరపంచాయతీ ౖచెర్మన్ జక్కుల వెంకయ్యను కోరగా స్పందించిన ఆయన అన్ని ఏర్పాట్లు చేయిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఎస్‌ఐ రాణి, కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఎం నాయకులు తన్నీరు మల్లికార్జున్‌రావు, ఎస్‌కే.మన్సూర్ అలీ,చిట్యాల అమర్‌నాథరెడ్డి, అట్లూరి హరిబాబు, దొడ్డా నర్సింహారావు, చిలకరాజు అజయ్‌కుమార్, తూముల శ్రీను, శీలం శ్రీను, శీతల రోషపతి, ఎస్‌డి.రఫీ, ఎస్‌కె.బాజీఉల్లా, పానుగంటి వెంకన్న, విద్యుత్ లైన్‌మెన్ భూతం వెంకటేశ్వర్లు, హెల్త్ అసిస్టెంట్ బత్తిని నగేష్ పాల్గొన్నారు.