peace committee
-
మణిపూర్‌లో శాంతి స్థాపనకు కేంద్రం కమిటీ
న్యూఢిల్లీ: మణిపూర్‌లో జాతుల మధ్య వైరాన్ని రూపుమాపి శాంతిని స్థాపించేందుకు, వివిధ వర్గాల మధ్య చర్చలు జరిపేందుకు కేంద్రం శాంతి కమిటీని ఏర్పాటు చేసింది. గవర్నర్ సారథ్యంలోని ఈ కమిటీలో ముఖ్యమంత్రి, కొందరు మంత్రులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు పౌరసంఘాలకు ప్రాతినిథ్యం ఉంటుందని శనివారం హోం శాఖ తెలిపింది. ఇటీవల మణిపూర్‌లో పర్యటన సమయంలో హోం మంత్రి అమిత్ షా శాంతి కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. మణిపూర్‌లో నెల రోజులుగా జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటి వరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మరో 300 మంది గాయపడ్డారు. -
ఫేస్బుక్ ఇండియా ఎండీకి నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరోసారి ఎదురు దెబ్బ తగిలింది.ఈ ఏడాది ఆరంభంలో చోటు చేసుకున్న ఢిల్లీ అల్లర్లలో ఫేస్‌బుక్‌కు పాత్ర ఉందంటూ, ఫేస్బుక్ ఇండియా అధికారులకు తాజా నోటీసులు జారీ అయ్యాయి. ద్వేషపూరిత కంటెంట్ పై చర్య తీసుకోవడంలో విఫలమైందంటూ ఆరోపించిన ఢిల్లీ అసెంబ్లీ కమిటీ సెప్టెంబర్ 15 న ఢిల్లీ విధానసభ ముందు హాజరుకావాలని కోరుతూ నోటీసు జారీ చేసింది. తమ వాదనను వినిపించేందుకు సెప్టెంబర్ 15 మంగళవారం హాజరు కావాలని ఢిల్లీ అసెంబ్లీ శాంతి సామరస్య పూర్వక కమిటీ,, ఫేస్బుక్ ఇండియా ఉపాధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ కు సమన్లు జారీ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, రాజేంద్రనగర్ చెందిన ఎమ్మెల్యే రాఘవ చాదా నేతృత్వంలోని కమిటీ ఈ సమన్లు జారీ చేసింది. ఆరోపణలపై కొంతమంది సాక్షులను, సాక్ష్యాలను పరిశీలించిన మీద ఈ సమన్లు జారీ చేశామని కమిటీ శనివారం అధికారికంగా ప్రకటించింది. ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లు తీవ్రతరం కావడానికి ఫేస్బుక్ కారణమైందని ఆగస్టు 31వ తేదీన జరిగిన రెండో విచారణలో కమిటీ నిర్ధారించింది. రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్న ఫేస్ బుక్ మరోసారి వివాదంలో పడింది. ప్రధానంగా అధికార బీజేపీకి అనుకూలంగా ఫేస్ బుక్ సంస్థ వ్యవహరిస్తోందని, హింసను ప్రేరేపించే విద్వేషపూరిత కంటెంట్ విషయంలో పట్టీపట్టనట్టు వ్యవహరిస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్‌లో ఇటీవల వచ్చిన ఆరోపణల మధ్య తాజా నోటీసులు జారీ అయ్యాయి. -
జాతర విజయవంతానికి సహకరించండి
వెంకటగిరి : ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వెంకటగిరి పోలేరమ్మ జాతరను విజయవంతం చేసేందుకు స్థానికులు సహకరించాలని స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కోరారు. స్థానిక త్రిపురసుందరి కల్యాణ మండపంలో గురువారం జాతర శాంతిసంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికుల సూచన మేరకు జాతరలో వీఐపీ పాస్ రద్దుతోపాటు రూ.500 టికెట్‌ను రూ.250కు తగ్గించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పోలేరమ్మ నిలుపు మండపాన్ని ఈ ఏడాది సంప్రదాయ తడకలతో కాకుండా ఇనుప చట్రాలతో 8 అడుగులకు బదులు 6 అడుగులు మాత్రమే ఏర్పాటు చేస్తామన్నారు. అమ్మవారి దర్శనానికి ర్యాంప్‌లు ఏర్పాటు చేస్తున్నామని, క్యూలైన్లో భక్తులకు మజ్జిగ, మంచినీటి ప్యాకెట్లను పంపిణీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ దొంతుశారద, వైఎస్సార్సీపీ నాయకుడు నెమళ్లపూడి సురేష్‌రెడ్డి, బీజేపీ నాయకుడు ఎల్.కోటీశ్వరరావు మాట్లాడారు. సంప్రదాయాలకు అనుగుణంగా జారత ఏర్పాట్లు ఉండాలని సూచించారు. అంతకుముందు పోలేరమ్మ దేవస్థానం హుండీ ఆదాయంతోపాటు జాతర రాబడికి సంబంధించిన నగదు జమ ఖర్చుల వివరాలు సమగ్రంగా చెప్పకపోవడంతో ఎమ్మెల్యే దేవాదాయశాఖ అధికారులపై మండిపడ్డారు. శుక్రవారానికి దేవాదాయశాఖ కార్యాలయంలో పూర్తి వివరాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ బీరంరాజేశ్వరరావు, తహసీల్దార్ మైత్రేయ పి.రాజేశ్వరరావు, తాండవ చంద్రారెడ్డి, ఈవో వై.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
శాంతి కమిటీ సమావేశం
హుజూర్నగర్ : గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, బక్రీద్ వేడుకలను ఘనంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్ఐ రంజిత్‌రెడ్డి సూచించారు. శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వివిధ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో జరిగిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గణేష్ ఉత్సవ కమిటీలు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. మండపాల వద్ద డీజేలకు అనుమతి లేదని తెలిపారు. గణేష్ విగ్రహాల వద్ద మైక్ ఏర్పాటుకు మీ–సేవలో చలానా చెల్లించి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలన్నారు. ఈ సందర్భంగా ఈద్గా వద్ద మౌలిక వసతులు కల్పించాలని పలువురు నాయకులు నగరపంచాయతీ ౖచెర్మన్ జక్కుల వెంకయ్యను కోరగా స్పందించిన ఆయన అన్ని ఏర్పాట్లు చేయిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఎస్ఐ రాణి, కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం నాయకులు తన్నీరు మల్లికార్జున్‌రావు, ఎస్కే.మన్సూర్ అలీ,చిట్యాల అమర్నాథరెడ్డి, అట్లూరి హరిబాబు, దొడ్డా నర్సింహారావు, చిలకరాజు అజయ్‌కుమార్, తూముల శ్రీను, శీలం శ్రీను, శీతల రోషపతి, ఎస్డి.రఫీ, ఎస్కె.బాజీఉల్లా, పానుగంటి వెంకన్న, విద్యుత్ లైన్మెన్ భూతం వెంకటేశ్వర్లు, హెల్త్ అసిస్టెంట్ బత్తిని నగేష్ పాల్గొన్నారు.