న్యూఢిల్లీ: మణిపూర్‌లో జాతుల మధ్య వైరాన్ని రూపుమాపి శాంతిని స్థాపించేందుకు, వివిధ వర్గాల మధ్య చర్చలు జరిపేందుకు కేంద్రం శాంతి కమిటీని ఏర్పాటు చేసింది. గవర్నర్ సారథ్యంలోని ఈ కమిటీలో ముఖ్యమంత్రి, కొందరు మంత్రులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు పౌరసంఘాలకు ప్రాతినిథ్యం ఉంటుందని శనివారం హోం శాఖ తెలిపింది.
ఇటీవల మణిపూర్‌లో పర్యటన సమయంలో హోం మంత్రి అమిత్ షా శాంతి కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. మణిపూర్‌లో నెల రోజులుగా జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటి వరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మరో 300 మంది గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment