
సాక్షి, నల్గొండ: ఉమ్మడి నల్గొండ జిల్లా టీడీపీ పార్లమెంటు సమావేశం శుక్రవారం రసాభాసగా మారింది. ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హుజూర్ నగర్ నియోజక వర్గ ఇంచార్జ్ కిరణ్మయి ఎన్నికల సమయంలో బీజేపీకి సహకరించిందని ఆరోపణలతో గొడవ మొదలైంది. తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమైన నేతలు ఆ సమావేశానికి రావడంపై అక్కడున్న కొందరు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సమావేశానికి పరిశీలకులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు సామ భూపాల్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణాలో దాదాపుగా టీడీపీ ఖాళీ అయిపోవడంతో ఆ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిన విషయం తెలిసిందే. కీలక నేతలందరూ వివిధ పార్టీల్లోకి వలస వెళ్ళిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment