నల్లగొండలో ఇక టీడీపీ శకం ముగిసినట్టేనా...? రెండు దశాబ్దాలకు పైగా జిల్లాలో తిరుగులేని శక్తిగా చెలామణి అయిన పార్టీ కథ ఇక కంచికి చేరినట్టేనా..? వరుస వలసలు.. నాయకత్వ లేమి.. ఆ పార్టీని గత చరిత్ర
పుటల్లోకి చేర్చినట్టే కనిపిస్తోంది.. ఆధిపత్యం నుంచి అథః పాతాళానికి చేరిన టీడీపీ నిష్క్రమణకు ముందస్తు ఎన్నికలు కావాల్సినంతగా తోడ్పడ్డాయి. అక్కడక్కడా ఆ పార్టీ నాయకత్వం కనిపించినా.. ఇక అది నామ
మాత్రమే అన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఈ సారి ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా టీడీపీ పోటీ చేయలేదు..!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో సంచలన నేతగా పార్టీ పెట్టిన స్వల్ప కాలంలోనే అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత ఎన్టీఆర్‌కు విజయం అందించిన జిల్లా. సంవత్సరాల తరబడి భువనగిరి, ఆలేరు, నాగార్జునసాగర్, కోదాడ, సూర్యాపేట వంటి నియోజకవర్గాలను పెట్టని కోటలుగా మలుచుకున్న పార్టీ. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించిన పార్టీ. కానీ.. చివరకు జిల్లాలో టీడీపీ పరిస్థితి మరీ దైన్యంగా మారింది. గత ఎన్నికల్లో పన్నెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థులు ఒక్క స్థానంలోనూ గట్టెక్కలేకపోయారు. ఈ సారి ఎన్నికల్లో అయితే మరీ ఘోరం.. ఒక్క స్థానం నుంచి కూడా పోటీ చేయలేకపోయింది. కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని మహాకూటమిలో చేరిన ఆ పార్టీ కోదాడ కోసం మరీమరీ పట్టుబట్టినా టికెట్ దక్కించుకోలేక పోయింది. ఆ పార్టీ నుంచి టికెట్ ఆశించిన బొల్లం మల్లయ్యయాదవ్ చివరి నిమిషంలో టీఆర్‌ఎస్‌లో చేరి కోదాడ నుంచి విజయం సాధించి.. టీడీపీ నాయకత్వ వైఫల్యాన్ని కళ్లకు కట్టారు.
గతమెంతో ఘనం..
తెలుగుదేశం పార్టీకి జిల్లాలో మంచి రికార్డే ఉంది. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు కోల్పోయిన భువనగిరి స్థానంలో 1985 నుంచి 2009 ఎన్నికల వరకు ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థులుగా ఎలిమినేటి మాధవరెడ్డి, ఆయన సతీమణి ఉమా మాధవరెడ్డి గెలుస్తూ వచ్చారు. జిల్లాలోని తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట, కోదాడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో విజయాలు సాధించిన చరిత్ర ఆ పార్టీకి ఉంది. ఆ పార్టీ మద్దతుతో వామపక్ష పార్టీలు సీపీఐ, సీపీఎం నల్లగొండ, నకిరేకల్, మునుగోడు, దేవరకొండ, మిర్యాలగూడలో పలు ఎన్నికల్లో విజయాలు సాధించాయి.
పన్నెండు స్థానాల్లో అన్ని చోట్లా పోటీ పడిన టీడీపీకి దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, మునుగోడు, నకిరేకల్ స్థానాలు మాత్రం ఒక్కసారి కూడా దక్కలేదు. నల్లగొండ జిల్లా పరిషత్‌కు సైతం ఆ పార్టీ ప్రాతినిధ్యం వహిం చింది. 1985 శాసనసభ ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ వ్యవస్థాప అధ్యక్షుడు ఎన్టీరామారావును విజయం వరించింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, రాజ్యసభ సభ్యులతో నల్లగొండ జిల్లాలో టీడీపీ గతంలో ఉజ్వలంగా వెలిగింది. కానీ ఇపుడా పార్టీ పరిస్థితి నామమాత్రమైంది.
వలసలతో ‘చిక్కి’శల్యం !
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ పార్టీ నాయకులు స్వేచ్ఛగా ఉద్యమంలో పాల్గొనలేక పోయా రు. పార్టీ నాయకత్వం ఆచరించిన రెండు కళ్ల సి ద్ధాంతం టీడీపీ నాయకులను ఎటూ తేల్చుకోలేకుండా చేసింది. అప్పటికే టీడీపీ నాయకులు ఒ క్కొక్కరే పార్టీనీ వీడి ఇతర పార్టీల్లో చేరా రు. ప్రధానంగా టీడీపీ నాయకులు టీఆర్‌ఎస్‌లో కుదురుకున్నారు. రాజకీయ పునరేకీకరణ పేర టీఆర్‌ఎస్ నా యకత్వం ఆపరేషన్ ఆకర్షకు పదు ను పెట్టడంతో జిల్లా టీడీపీ వలసతో చిక్కి శల్యమైంది. జిల్లాల విభజన తర్వాత ఏ జిల్లా కమిటీలు ఆ జిల్లాకు ని యమించినా ఫలితం లేకుండా పోయింది. ముం దుగా పలువురు నాయకుల టీఆర్‌ఎస్ బాటపడితే ద్వితీయార్థంలో కాంగ్రెస్ బాటపట్టారు. జిల్లాలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసిన నేతలు సై తం పార్టీని వీడి బయటపడ్డారు. కోదాడ మాజీ ఎ మ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు చాలా ముందుగానే టీఆర్‌ఎస్‌కు వెళ్లిపోయారు. ఆ తర్వాత మాజీ మం త్రి ఉమామాధవరెడ్డి సుమారు ఏడాది కిందట గులాబీ కండువా కప్పుకున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఆమె తనయు డు పార్టీ మా రారు. జిల్లా కేంద్రంలో ఆ పార్టీకి ఏకైక దిక్కుగా ఉన్న కంచర్ల భూపాల్‌రెడ్డి, అంతకుముందు మాజీ మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కృష్ణారెడ్డి పార్టీ మారారు. సుదీర్ఘకాలం ఉమ్మడి జిల్లాకు ఆపార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన బడుగుల లింగయ్యయాదవ్ సైతం సైకిల్ దిగి కారెక్కారు. కొన్నాళ్లకు ఆయనను రాజ్యసభ సభ్యత్వం వరిం చింది. నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా బిల్యానాయ క్, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన పటే ల్ రమేష్‌రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇక, ఆఖ రుగా ఆ పార్టీ తెలంగాణలో పెద్దదిక్కు అనదగిన సీ నియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సిం హులు కూడా టీడీపీ నుంచి బయటకు వచ్చినా ఏ పార్టీలో చేరలేదు. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన సీనియర్ నేత వంగాల స్వామిగౌడ్ ఎన్నికల ముందు కాంగ్రెస్ గూటికి చేరారు. గత ఎన్నికల్లో ఆయన హుజూర్‌నగర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైనా ఎన్నికల ముందు వరకూ పార్టీలో నే కొనసాగారు. ఇపుడు చెప్పుకోవడానికి ఆ పార్టీకి ఉన్న నాయకత్వం నామమాత్రమే కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment