Published
Sun, Jul 31 2016 11:28 PM
| Last Updated on Mon, Sep 4 2017 7:13 AM
జిల్లాస్థాయి కళాకారుల సదస్సును విజయవంతం చేయాలి
హుజూర్‌నగర్ : కృష్ణా పుష్కరాల కళోత్సవాలను జయప్రదం చేసేందుకు ఆగస్టు 3న పట్టణంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సదస్సును విజయవంతం చేయాలని రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు వేముల వెంకటేశ్వర్లు, ధర్మూరి వెంకటేశ్వర్లు కోరారు. ఆదివారం స్థానికంగా జరిగిన ఆ సంఘం సమావేశంలో మాట్లాడారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా నిర్వహించే ప్రదర్శనల్లో స్థానిక కళాకారులకు ప్రాధాన్యత నివ్వాలన్నారు. సమావేశంలో దొంతగాని సత్యనారాయణ, ధూళిపాళ రామకృష్ణ, కె.రామయ్య, సుదర్శన్, పిచ్చయ్య, చుక్కయ్య, భద్రాచలం, జాన్‌సైదా, తేజారెడ్డి, కవిత, తాటికొండ వెంకటి, శ్రీను, నాగయ్య, మంగ, నాగమణి, ధర్మయ్యగౌడ్, రమేష్, నరేష్ పాల్గొన్నారు.