రుణాలను మంజూరు చేయాలి
రుణాలను మంజూరు చేయాలి
Published Sun, Jul 17 2016 7:34 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM
హుజూర్‌నగర్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా 2015–16 ఆర్థిక సంవత్సరానికి గాను రుణాలు పొందేందుకు ఎంపికైన లబ్ధిదారులకు సబ్సిడీ నగదును మంజూరు చేయాలని డీసీసీ అధికార ప్రతినిధి ఎండి.అజీజ్‌పాషా కోరారు. ఆదివారం స్థానికంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వయం ఉపాధి కోసం ఆయా వర్గాలకు చెందిన లబ్ధిదారులను ఎంపిక చేసి 5 నెలలు గడిచినా నేటి వరకు వారి ఖాతాల్లో నగదు జమ చేయలేదన్నారు. స్వయం ఉపాధి రుణాలు ఇచ్చేందుకు బడ్జెట్‌లో కేటాయింపులు చేసినట్లు ప్రభుత్వం ప్రకటిస్తున్నా కార్పొరేషన్లు మాత్రం నగదు మంజూరు కాలేదని చెపుతున్నాయన్నారు. ప్రతి ఏడాది రెండు సార్లు లబ్ధిదారుల ఎంపిక జరగాల్సి ఉనా మొదటి విడత లబ్ధిదారులకే ఇంత వరకూ రుణాలు మంజూరు కాలేదన్నారు. సమావేశంలో నాయకులు కోల మట్టయ్య, ఎస్‌కె.అహ్మద్‌హుస్సేన్, జాల గురవయ్య, ఎండి.జహీరాబేగం, నాగరాజు, వెంకటేశ్వర్లు, ఎల్.నాగేశ్వరరావు, యోహాన్ పాల్గొన్నారు.
17హెచ్‌జడ్‌ఆర్01 – సమావేశంలో మాట్లాడుతున్న అజీజ్‌పాషా
Advertisement