సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనాల్సి ఉండగా, ఏవియేషన్ అనుమతి లేకపోవడంతో చివరి నిమిషంలో రద్దయింది. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలో గురువారం టీఆర్‌ఎస్ బహిరంగ సభ ఏర్పాటు చేయగా, పార్టీ అధినేత హోదాలో సీఎం కేసీఆర్ హాజరయ్యేలా షెడ్యూలు సిద్ధం చేశారు. అయితే గురువారం హుజూర్‌నగర్‌లో భారీ వర్షం కురుస్తుండటంతో..హెలిక్యాప్టర్‌కు ఏవియేషన్ విభాగం అనుమతివ్వలేదు.
సీఎం భద్రతను దృష్టిలో పెట్టుకుని హెలిక్యాప్టర్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదని ఏవియేషన్ విభాగం డైరెక్టర్ వీఎన్ భరత్‌రెడ్డి ప్రకటన విడుదల చేశారు. హెలిక్యాప్టర్‌కు అనుమతి లేకపోవడంతో సీఎం పర్యటన రద్దయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. కాగా ఈ నెల 19తో హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ప్రచారం ముగియనుండటంతో.. సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం ఉండే అవకాశం లేదని టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment