నగరపంచాయతీలో ఉపాధి హామీ పనులు కల్పించాలి
నగరపంచాయతీలో ఉపాధి హామీ పనులు కల్పించాలి
Published Tue, Jul 26 2016 1:48 AM | Last Updated on Tue, Oct 16 2018 6:35 PM
హుజూర్‌నగర్ : నగరపంచాయతీ పరిధిలో కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారి అయిలయ్య డిమాండ్ చేశారు. సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరపంచాయతీ ఏర్పడిన రెండేళ్ల నుంచి పనులు లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని ఆలోచించడం సరికాదన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు నాగారపు పాండు, కె.నగేష్, పారేపల్లి శేఖర్‌రావు, ములకలపల్లి సీతయ్య, అబ్దుల్‌నబీ, హుస్సేన్, రోశపతి, శీలం శ్రీను, దుగ్గి బ్రహ్మం, నాగేశ్వరరావు, వెంకన్న, భద్రమ్మ, వీరమ్మ,ఉమ, పార్వతి పాల్గొన్నారు.
Advertisement