హుజూర్‌నగర్ రూరల్/గరిడేపల్లి: గ్రామాల్లో తాగడానికి మంచినీళ్లు లేకున్నా.. మద్యం ఏరులై పారుతోందని వైఎస్సార్‌టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. మిషన్ భగీరథ ట్యాంకులున్నా చుక్క నీరు రావడం లేదని, ప్రజలు మంచినీళ్లకు కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని నిప్పులు చెరిగారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా షర్మిల బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం అమరవరం, గరిడేపల్లి మండలం కల్మలచెరువు గ్రామంలో నిర్వహించిన మాట–ముచ్చట కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
నియోజకవర్గంలో జరుగుతున్న భూ కబ్జాలు, రేషన్, మద్యం మాఫియా గురించి మాట్లాడితే తమ పార్టీ నాయకులపై, మహిళలపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ దాడులను నిరసిస్తూ తాను మూడు గంటలు వర్షంలో కూర్చొని ధర్నా చేస్తే గానీ సర్కార్ లొంగలేదన్నారు. రేపు ఎలా పాదయాత్ర చేస్తారో చూస్తాం అంటూ పోలీసులు బెదిరించారని, అయితే బుధవారం ఎలా చేయనివ్వరో చూద్దాం అని తాను పాదయాత్ర చేస్తున్నట్లు షర్మిల పేర్కొన్నార
Comments
Please login to add a commentAdd a comment