షర్మిలతో కలసి నడుస్తున్న గీతకార్మికులు
రామన్నపేట: ప్రజలు కేసీఆర్‌ను రెండుసార్లు నమ్మి గెలిపిస్తే.. నట్టేట ముంచారని, మరో సారి మోసగించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం నల్లగొండ జిల్లా చిట్యాల నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా రామన్న పేట మండలం జనంపల్లికి చేరింది. ఆ తర్వా త రామన్నపేట మండల కేంద్రానికి చేరుకుంది. సుభాష్ సెంటర్‌లోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాటాముచ్చట కార్యక్రమంలో మాట్లాడారు. మిగులు రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణకు సీఎం కేసీఆర్ రూ. 4 లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాలు భూపంపిణీ, రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి హామీలు ఏమ య్యాయని ప్రశ్నించారు. రక్తం ధారపోసి, అప్పులు చేసి చదివించిన పేదింటి పిల్లలకు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కేసీఆర్‌కు చీమకుట్టినట్లు కూడా లేదన్నారు.
మాటమీద నిలబడేది వైఎస్సార్ బిడ్డనని, తెలంగాణ ప్రజల పక్షాన పోరాడటానికే పార్టీ ని స్థాపించానని తెలిపారు. ప్రజల పక్షాన పో రాడమని కాంగ్రెసోళ్లకు ఓట్లేస్తే అధికార పార్టీకి అమ్ముడు పోతున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి, ఏపూరి సోమన్న, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల అధ్యక్షులు ఇం జం నర్సిరెడ్డి, మహ్మద్ అక్తల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment