Published
Tue, Jul 26 2016 7:02 PM
| Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
దళితులకు వ్యతిరేకంగా పాలన సాగిస్తున్న కేంద్రం
హుజూర్‌నగర్ : కే ంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దళితులకు వ్యతిరేకంగా పాలన సాగిస్తుందని ఆప్ జిల్లా కన్వీనర్ లింగిడి వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం స్థానికంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తప్పుడు విధానాల వల్ల ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, మహారాష్ట్రలోని భజరంగ్‌దళ్, గో సంరక్షణ దళ సభ్యులు దళితులను హింసిస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే నల్లధనాన్ని వెలికి తీస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక వారికే అనుకూలంగా వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతిమయంగా మారి కుటుంబ పాలన చేస్తుందన్నారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి సరికొండ రుషికేశ్వర్‌రాజు, నాయకులు తన్నీరు ఉమేష్, ఎం.పురుషోత్తంరెడ్డి, తుల వెంకటేశ్వర్లు, మహేష్, వెంకన్నగౌడ్, మనోహర్‌గుప్త, వెంకటేశ్వర్లు, సైదులు, జగన్, విజయ్‌రెడ్డి, రామకృష్ణ పాల్గొన్నారు.