చాలా పవర్‌ఫుల్.. చేసే పని చాలా సింపుల్!
స్వచ్ఛంగా...
స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉంటే.. ఎన్నో వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇలాంటి మంచి నీరు ఎలా లభ్యమవుతుందన్నదే ప్రశ్న. అనేకమంది ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు చేశారు.. చేస్తున్నారు కూడా. తాజాగా ఈ జాబితాలోకి చేరుతోంది ఈ ఫొటోలో కనిపిస్తున్న యంత్రం. చూసేందుకు చిన్నగా కనిపిస్తుంది కానీ... ఇది చాలా పవర్‌ఫుల్. చేసే పని చాలా సింపుల్! ఉప్పు, నీళ్లు కలిపి, బాగా కలియదిప్పి కొంచెం కరెంట్ ప్రసరింప చేస్తే చాలు.
ఆ నీరు కాస్తా క్లోరిన్‌గా మారిపోతుంది. తాగునీటిలో ఉన్న బ్యాక్టీరియా, వైరస్‌లను చంపేస్తుంది. అమెరికాకు చెందిన మౌంటెయిన్ సేఫ్టీ రీసెర్చ్ (ఎంఎస్‌ఆర్) అనే సంస్థ అభివృద్ధి చేసిన ఈ యంత్రం ఒకసారికి దాదాపు రెండు వందల మందికి సరిపడా మంచినీటిని శుద్ధి చేస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇలాంటివి దాదాపు 2,500 ఏర్పాటు చేయాలని ఎంఎస్‌ఆర్ లక్ష్యంగా నిర్దేశించుకుంది.
తాగునీటి శుద్ధి కోసం అమెరికన్ సంస్థ కనిపెట్టిన యంత్రం