విద్యార్థులకు జరగని ‘వైద్యపరీక్షలు’
► విద్యాసంవత్సరం ప్రారంభమై 4నెలలు అయినా ప్రారంభంకాని ఆర్‌బీఎస్‌కే
► వ్యాధుల బారిన పడుతున్న విద్యార్థులు
విజయనగరంఫోర్ట్: విద్యార్థుల ఆరోగ్యానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెబుతునన్న ప్రభుత్వం ప్రకటనలకు, ఆచరణకు పొంతన ఉండడం లేదు. రాష్ట్రీయ బాల ఆరోగ్యకార్యక్రమమే ఇందుకు నిదర్శనం. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలి.
వ్యాధుల బారిన పడిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలి. విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు దాటినప్పటికీ ఈ కార్యక్రమం ఇంకా ప్రారంభం కాలేదు. విద్యార్థులను సంపూర్ణ ఆరోగ్యవంతులను చేయయాలనే ఉద్దేశ్యంతో అప్పటి ప్రభుత్వం 2011లో జవహర్ బాల ఆరోగ్యరక్ష కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పుడు దాన్ని రాష్ట్రీయ బాల ఆరోగ్య ఆరోగ్యకార్యక్రమంగా పేరు మార్చారు.
2,58,506 మంది విద్యార్థులకు జరగని పరీక్షలు
జిల్లాలో2935 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నారుు. వాటిలో 2,58,506 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ వైద్య పరిక్షలు చేయాల్సి ఉంది.
మధ్యలోనే ఆగిపోరుున మొబైల్ టీమ్‌ల పక్రియ
విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసేందుకు మొబైల్ మెడికల్ టీమ్‌ల ఏర్పాటుకు 5 నెలల క్రితం నోటీఫికేషన్ ఇచ్చారు. వాటికి ఇంటర్వ్యూలు నిర్వహించి సిబ్బందిని కూడ ఎంపిక చేశారు. అరుుతే వారికి ఇంతవరకు నియామక పత్రాలు ఇవ్వలేదు.జిల్లాలో 22 టీమ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణరుుంచారు. ప్రతి టీమ్‌లోను ఒక వైద్యాధికారి, ఒక ఫార్మసిస్టు, ఒక ల్యాబ్‌టెక్నిషయన్, ఒక స్టాఫ్ నర్సు ఉంటారు.
విజృంభిస్తున్న వ్యాధులు
జిల్లాలో వ్యాధుల వ్యాప్తి అధికంగా ఉంది. ముఖ్యంగా విద్యార్థులు పిల్లలు ఎక్కువగా వైరల్ జ్వరాలు, జలుబు, దగ్గు, మలేరియా , డెంగీ , హ్రస్వదృస్టి, దంత సమస్యలు వంటి వ్యాధుల బారిన పడుతున్నారు.