
వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి
రానున్న వర్షాకాలంలో గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా వైద్యాధికారులు, సిబ్బంది పకడ్బందీ చర్యలు...
ఉట్నూర్ రూరల్ : రానున్న వర్షాకాలంలో గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా వైద్యాధికారులు, సిబ్బంది పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌వో ప్రభాకర్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా క్లస్టర్ పరిధిలోని వైద్యాధికారులు, మెడికల్ సిబ్బందితో ఎస్‌పీహెచ్‌వో కార్యాలయంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, జైనూర్, ఆసిఫాబాద్, పంగిడి, జామ్ని ప్రాంతాల్లో గతంలో మలేరియా కేసులు అధికంగా నమోదయ్యాయని ఇలాంటి సమస్యాత్మక గ్రామాల్లో దోమల నివారణకై దోమల మందులు, ఎప్పటికప్పుడు వాట్సప్‌లో వివరాలు తెలపాలని సూచించారు. వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటే వ్యాధులు ప్రబలకుండా ఉంటాయన్నారు. కార్యక్రమంలో జైనూర్ ఎస్పీహెచ్‌వో వాణి, హస్నాపూర్ వైద్యాధికారి రవి, ఏఎంవో వెంకటేశ్వర్, పాల్గొన్నారు.