
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్కులో జంతువుల మృత్యువాత సీరియల్‌గా సాగుతోంది. తాజాగా మరో జంతువు చనిపోయింది. బుధవారం రాత్రి పొద్దుపోయాక దీప అనే ఆడ చిరుతపులి చనిపోయింది. దీని వయస్సు 22 ఏళ్లు. గత కొద్దికాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న చిరుతకు సరైన వైద్యం అందక చనిపోయింది.
గడిచిన ఏడాది కాలంలో ఇక్కడి జూలో ఏనుగు, అడవిదున్న, నీటిగుర్రం, నీటి కుక్క, హైనా, సారస్ క్రేన్ పక్షి, చింపాంజి, ఎలుగు బంటి, నామాల కోతులతో సహా 70కి పైగా జంతు వులు చనిపోయాయి. వృద్ధాప్యంతోనే జంతువులు చనిపోతున్నాయని జూ అధికారులు చెబుతున్నప్పటికీ... ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వైరస్ వ్యాధులు చుట్టుముట్టడంతోనే జంతువులు మరణిస్తున్నాయని రిటైర్డ్ ఫారెస్టు అధికారులు చెబుతున్నారు.
అన్ని జంతువులకూ ఒకటే వ్యాధి
చనిపోతున్న జంతువులన్నీ, శ్వాస, జీర్ణ సంబంధ వ్యాధులతోనే చనిపోతున్నట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. నెలల తరబడి ఎన్‌క్లోజర్లను శుభ్రం చేయకపోవటం, నాణ్యమైన ఆహారం ఇవ్వకపోవడం వల్లే జంతువులు మరణిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment