ఈ నాలుగు.. ప్రమాదకరం | 63 percent of the nationwide deaths were from infectious diseases | Sakshi
Sakshi News home page

ఈ నాలుగు.. ప్రమాదకరం

Published Sun, Jan 3 2021 5:32 AM | Last Updated on Sun, Jan 3 2021 5:32 AM

63 percent of the nationwide deaths were from infectious diseases - Sakshi

‘జీవనశైలి’ జబ్బులు ప్రాణాంతకమవుతున్నాయి. బిజీ జీవితంలో వ్యాయామంపై శ్రద్ధ చూపకపోవడం అనేకమందికి ముప్పుగా పరిణమిస్తోంది. దేశంలో మొత్తం మృతుల్లో 63 శాతం మంది నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ (అసాంక్రమిక వ్యాధులు–అంటువ్యాధులు కానివి)తోనే మృతి చెందుతున్నట్టు తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీనిపై అన్ని రాష్ట్రాలు అప్రమత్తం కావాలని హెచ్చరించింది. మధుమేహం, గుండెజబ్బులు, క్యాన్సర్, స్ట్రోక్స్‌ (పక్షవాతం–హైపర్‌టెన్షన్‌ కారణంగా వచ్చే) వంటి జీవనశైలి జబ్బులతో ఏటికేటికీ మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతోందని తెలిపింది. దీన్ని నియంత్రించేందుకు అన్ని రాష్ట్రాలు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించింది. కోవిడ్‌ సోకిన వారిలోనూ ఎక్కువ మంది ఈ అసాంక్రమిక వ్యాధి బాధితులే మృతిచెందినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మన రాష్ట్రంతోపాటు పలు రాష్ట్రాల్లో పొగ తాగడం, మద్యం, హానికర తిండి తినడం, శారీరక శ్రమ లేకపోవడం జీవనశైలి జబ్బులకు ప్రధాన కారణాలు. ఎక్కువమందికి వ్యాయామంపై అవగాహన లేకపోవడం కూడా వ్యాధులకు కారణమవుతోంది. స్థూలకాయం కారణంగా చాలామంది రక్తంలో చక్కెర నిల్వలు పేరుకుపోతున్నాయి.                                
– సాక్షి, అమరావతి

ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో రాష్ట్రంలో ఇంటింటి సర్వే 
జీవనశైలి జబ్బులను ప్రాథమిక దశలోనే గుర్తించి మెరుగైన వైద్యసేవలు అందించేందుకు మన రాష్ట్రంలో రెండు నెలలుగా ఇంటింటి సర్వే జరుగుతోంది. ఓడీకే (ఓపెన్‌ డేటా కిట్‌) పేరుతో రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో నిర్వహిస్తున్న ఈ సర్వే ఇప్పటికే 72 శాతానికిపైగా పూర్తయింది. ఏ రాష్ట్రంలో చేయని విధంగా సుమారు 19 వేలమంది ఏఎన్‌ఎంలు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. మధుమేహం, బీపీ, క్యాన్సర్, లెప్రసీ వంటి జబ్బులపై ప్రాథమిక లక్షణాలను గుర్తిస్తూ ఈ సర్వే సాగుతోంది. వ్యక్తి ఎత్తు, బరువు, బీపీ, బయోకెమికల్‌ ఎస్టిమేషన్స్, ఫాస్టింగ్‌ బ్లడ్‌ సుగర్, యూరినరీ సోడియం పరిమాణం వంటివి నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన సర్వే ప్రకారం రాష్ట్రంలో 15 ఏళ్ల వయసు దాటిన వారిలో 14.2 శాతంమంది పొగ తాగుతున్నారు. 21.4 శాతం మంది పొగలేని పొగాకును వాడుతున్నారు. 18 శాతం మంది హైపర్‌ టెన్షన్‌ (బీపీ)తో, 13 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నారు. రాష్ట్రంలో జీవనశైలి జబ్బుల బాధితులను గుర్తించే ప్రక్రియ నిరంతరం కొనసాగేలా చూస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement