నాదమే నాడులకు దివ్యౌషధం..
రాగాలతో రోగాలు నయమవుతాయని మనవాళ్లు చాలాకాలంగానే చెబుతూ వస్తున్నారు. తాజాగా, నాదమే నాడులకు దివ్యౌషధమని పరిశోధకులు కూడా సెలవిస్తున్నారు. ఆరోగ్యవంతమైన నాడీ వ్యవస్థ కోసం చక్కని శాస్త్రీయ సంగీతాన్ని ఆస్వాదించడమే సరైన మార్గమని వారు చెబుతున్నారు. ఆహ్లాదభరితమైన శాస్త్రీయ సంగీతాన్ని వినడం మొదలుపెట్టిన కొద్దిసేపట్లోనే నాడీ వ్యవస్థలో సానుకూలమైన మార్పులు వస్తాయని అంటున్నారు.
సంగీతాన్ని వినడం వల్ల మానసిక స్థితి నిలకడగా మారుతుందని, జ్ఞాపకశక్తి పెరుగుతుందని చెబుతున్నారు. అంతేకాదు, చక్కని సంగీతం నాడీ వ్యవస్థ క్షీణతను అరికడుతుందని తమ అధ్యయనంలో తేలినట్లు కెనడాలోని రోట్‌మన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్త డాక్టర్ ఇర్మా జార్వెలా వెల్లడించారు.