Tunes
-
దేవర కు కలిసోస్తున్న కాపీ ట్యూన్స్.. త్వరలో మూడో సింగల్ రిలీజ్...
-
పెద్దనాన్నలా ట్యూన్లు కట్టలేను కావాలంటే...
ఇసైజ్ఞానిలా ట్యూన్లు కట్టలేను కావాలంటే ఆయనలా డ్రస్ ధరించగలను అని చెప్పానని నటుడు, సంగీతదర్శకుడు ప్రేమ్‌జీ పేర్కొన్నారు. ట్రిపుల్ వి.రాకార్డ్స పతాకంపై ఇంతకు ముందు ఎన్నమో నడక్కుదు వంటి విజ యవంతమైన చిత్రాన్ని అందించిన వీవీ.వినోద్‌కుమార్ తాజాగా నిర్మిస్తున్న చిత్రం అచ్చమిండ్రి. విజయ్‌వసంత్,సృష్టిడాంగే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సముద్రఖని, రాధారవి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రేమ్‌జీ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో సంగీతదర్శకుడు ప్రేమ్‌జీ మాట్లాడుతూ విజయ్‌వసంత్ హీరోగా వినోద్‌కుమార్ చిత్రం నిర్మించనున్నారని చెప్పగానే దానికి తానే సంగీతదర్శకుడినని అన్నానన్నారు.అందుకు వారూ అంగీకరించారని తెలిపారు.అంతే కాదు ఇకపై వారు రూపొందించే చిత్రాలు తానే సంగీతదర్శకుడినని, ఇది మాటలతో కుదుర్చుకున్న ఒప్పందం అని చెప్పారు. ఇకపోతే తాను తన పెద్దనాన్న(ఇళయరాజా) పాటల ట్యూన్సను కాపీ కొడుతున్నానని చాలా మంది అంటున్నారన్నారు. నిజమే తాను తన పెద్దనాన్న ట్యూన్సనే మార్చి రూపొందిస్తున్నానని ఒప్పుకుంటున్నానన్నారు. ఇసైజ్ఞాని సంగీతాన్ని అందరూ కాపీ కొడుతున్నారని, అలాంటిది తమ సొత్తు అరుున ఆయన సంగీతాన్ని తాను కాపీ కొట్టకూడదా?అంటూ ప్రశ్నించారు. తన దర్శక నిర్మాతలు ఇళయరాజా ట్యూన్సలా హారుుగా ఉండే పాటలను రూపొందించమని అడుగుతున్నారని, ఆయనలా సంగీతాన్ని అందించడం తన వల్లకాదు. కావలంటే ఆయనలా డ్రస్ ధరించగలనని చెప్పేవాడినని అన్నారు. అన్నట్టుగానే ఒక రోజు పెద్దనాన్నలా జుబ్బా, పంచె కట్టి, మెడలో రుద్రాక్షమాల ధరించి, హార్మోనియం చేతపట్టి ఫొటోలకు ఫోజులిచ్చానని తెలిపారు. వాటిని పోస్టర్‌గా ముద్రించి వాడవాడలా అంటించారని తెలిపారు.అలా పెద్దనాన్న ఇంటి గోడలకు అంటించడంతో అవి చూసిన ఆయన తనను పిలిచి ఏరా తనలా ఫోజులిచ్చి ఎగతాళి చేస్తున్నావా? అని అడిగారన్నారు. అందుకు తాను అదికాదు పెద్దనాన్నా మీ ట్యూన్సలా తనను కట్టమన్నారని, అలా తన వల్లకాదు కావాలంటే మీలా దుస్తులు ధరించి ఫొటో ఫోజులివ్వగలనని చెప్పానని తెలిపారు. వసంత్‌కుమార్, సంగీతదర్శకుడు యువన్రాజా, వెంకట్‌ప్రభు, చిత్ర హీరో విజయ్‌వసంత్, సృష్టిడాంగే, చిత్రనిర్మాత వినోద్‌కుమార్, దర్శకుడు రాజపాండే, ఆర్కే.సెల్వమణి, పొన్వన్నన్, రోహిణి పాల్గొన్నారు. -
నాదమే నాడులకు దివ్యౌషధం..
రాగాలతో రోగాలు నయమవుతాయని మనవాళ్లు చాలాకాలంగానే చెబుతూ వస్తున్నారు. తాజాగా, నాదమే నాడులకు దివ్యౌషధమని పరిశోధకులు కూడా సెలవిస్తున్నారు. ఆరోగ్యవంతమైన నాడీ వ్యవస్థ కోసం చక్కని శాస్త్రీయ సంగీతాన్ని ఆస్వాదించడమే సరైన మార్గమని వారు చెబుతున్నారు. ఆహ్లాదభరితమైన శాస్త్రీయ సంగీతాన్ని వినడం మొదలుపెట్టిన కొద్దిసేపట్లోనే నాడీ వ్యవస్థలో సానుకూలమైన మార్పులు వస్తాయని అంటున్నారు. సంగీతాన్ని వినడం వల్ల మానసిక స్థితి నిలకడగా మారుతుందని, జ్ఞాపకశక్తి పెరుగుతుందని చెబుతున్నారు. అంతేకాదు, చక్కని సంగీతం నాడీ వ్యవస్థ క్షీణతను అరికడుతుందని తమ అధ్యయనంలో తేలినట్లు కెనడాలోని రోట్మన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్త డాక్టర్ ఇర్మా జార్వెలా వెల్లడించారు. -
సంగీత వంశీ
కళ ఒక సంగీత దర్శకుడిగా ఎక్కువకాలం నిలబడాలంటే, సంగీతం మీద పిపాస, మంచి ట్యూన్స్ చేయాలనే ఆసక్తి, వృత్తి పట్ల నిబద్ధత, దీక్ష, కృషి, పట్టుదల ఇవన్నీ ఉండితీరాలి. వంశీకి ఇటువంటి బలమైన కోరికలు ఉంటే, ఉత్తమసంగీత దర్శకుడు అవడానికి అంతకన్నా ఇంకేం కావాలి. మ్యూజిక్... వెస్ట్రన్... రాక్... పాప్... నేటి తరానికి ఇదొక ప్యాషన్... ఇంటర్నెట్లో మ్యూజిక్ నోట్స్ డౌన్లోడ్ చేసుకుంటూ... వాద్యపరికరాలను కూడా అందులోనే తీసుకుంటూ... స్వయంగా సంగీత దర్శకత్వం చేస్తున్నారు... పట్టుమని పాతికేళ్లు కూడా నిండకుండానే సంగీత ప్రపంచంలో... చిన్నదో పెద్దదో... తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకుంటున్నారు. లఘుచిత్రాలతో కెరీర్ ప్రారంభించి... చలనచిత్రాల స్థాయికి ఎదుగుతున్నారు... ‘ఓ సఖీ’ ఆల్బమ్ (టాప్ టెన్‌లో ఉంది) తో 2011లో సంగీత జీవితం ప్రారంభించి, చలనచిత్రాలకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేసే స్థాయికి ఎదిగాడు వంశీ. ‘‘నాకు చిన్నప్పటి నుంచి కీబోర్డ్ అంటే చాలా ఇష్టం. కీబోర్డులో సరిగమల అభ్యాసానికి నాన్నగారే శ్రీకారం చుట్టారు. నాకు చదువు మీద అంతగా శ్రద్ధ లేదు. అందువల్ల చదువు మానేసి హైదరాబాద్ వచ్చాను. హిందుస్థానీ, పాశ్చాత్యం... ఈ రెండు సంప్రదాయ సంగీతాలనూ నేర్చుకున్నాను. సంగీతంతో పాటు డిజిటల్ రికార్డింగ్, మ్యూజిక్ ప్రొడక్షన్ నేర్చుకున్నాను. సంగీతం మీద ఉన్న అభిరుచి కొద్దీ, కొద్దిమంది మిత్రులతో కలసి ‘వేవ్ బ్యాండ్’ అని ఒక మ్యూజికల్ బ్యాండ్ ఏర్పాటుచేశాను’’ అంటూ వంశీ తన సంగీత ప్రయాణాన్ని వివరించారు. ‘పెళ్లి పుస్తకం’ లోని పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది’’ అంటున్న వంశీ యూ ట్యూబ్‌లో ప్రముఖుల సంగీత కచ్చేరీలు చూసి పరిజ్ఞానం పెంచుకుంటున్నారు. ఇప్పటి వరకు అనేక చలనచిత్రాలకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చేశాడు. కొన్ని చిత్రాలకు అసిస్టెంట్‌గానూ చేశాడు. ఒక పక్కన సంగీతం నేర్చుకుంటూనే మరో పక్క అతి కష్టం మీద పదవ తరగతి పూర్తి చేశాడు. ‘స్వామిరారా’, ‘ఉయ్యాలా జంపాలా’ వంటి చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిన సన్నీ దగ్గర అసిస్టెంట్ ఆడియో ఇంజనీర్‌గా కొన్ని నెలలు పనిచేశాక, తాను చేస్తున్న పని పట్ల అంత సంతృప్తి కలగలేదు. ‘‘కీ బోర్డు నేర్చుకోవాలనే కోరిక నానాటికీ పెరుగుతూ వచ్చింది. దాంతో ఉద్యోగం వదిలేసి, పూర్తి సమయాన్ని కీ బోర్డు నేర్చుకోవడం కోసం కేటాయించాను’’ అని చెబుతాడు వంశీ. సినిమా సంగీతానికి ఎంతో అవసరమైన పాశ్చాత్య సంప్రదాయ సంగీతం తనకు తానుగా నేర్చుకున్నారు. పెద్దపెద్ద సంగీత దర్శకుల దగ్గర కీబోర్డు ప్లేయర్‌గా పనిచేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో... ఋషి, కెమిస్ట్రీ, సరదాగా అమ్మాయితో, రొమాన్స్, నువ్వలా నేనిలా, పట్టపగలు... చలనచిత్రాలకు నేపథ్య సంగీతం అందించారు. ‘‘పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే మంచి సంగీతం చేయాలి. నా వరకు నేను మెలొడీలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నాను. సంగీతం, సాహిత్యం, ఆర్కెస్ట్రా... ఒకదాన్ని ఒకటి డామినేట్ చేయకుండా ఉండేలా చూస్తున్నాను. ఆర్కెస్ట్రా తగ్గించి, భావం అర్థమయ్యేలాగ చేస్తున్నాను’’ అని చెప్పే వంశీకి ఇళయరాజా అంటే చాలా ఇష్టం. పరోక్షంగా ఆయన ప్రభావం తన మీద ఉందనీ, త్వరలోనే తనకు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చేలాంటి పాటలు చేస్తానని అంటున్నారు. సంగీతం చేస్తున్నప్పుడు అందరితోనూ స్నేహంగా ఉంటూ తనకు కావలసిన విధంగా వాళ్ల దగ్గర నుంచి రాబట్టుకుంటున్నారు. ఎంఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వచ్చిన జనగణమన, పెళ్లి పుస్తకం, ప్రేమపకోడీ, హూ ఆర్ దే? పొసెసివ్‌నెస్, మధురమే, చిట్టితల్లి... లఘుచిత్రాలకు సంగీతం చేశారు వంశీ. ‘‘పెళ్లిపుస్తకం’ పాటకు 2.5 లక్షల హిట్స్ వచ్చాయి. నాకు మంచి పేరు కూడా వచ్చింది’’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు వంశీ. - డా. వైజయంతి -
ఈ జంగ్...గిటార్ కింగ్!
ఆ కుర్రవాడు సరదాగా గిటార్ వాయించడం మొదలుపెట్టాడు. ఆస్ట్రియాకు చెందిన థామస్ లీబ్, ఇంగ్లండ్‌కు చెందిన మార్టిన్ టేలర్... వీరంతా ఆ కుర్రవాడి గిటార్ ప్రదర్శన యూట్యూబ్‌లో చూసి ‘ఆసమ్’ అంటూ చప్పట్లు కొట్టారు. వినసొంపైన అతడి గిటార్ విన్యాసం ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది... తన శరీరంతో సమానంగా ఉన్న గిటార్‌తో ప్రపంచాన్ని సమ్మోహనపరచిన ఆ వ్యక్తి పేరు సుంఘాజంగ్. అతడిని చూసినవారంతా చైల్డ్ ప్రాడిజీ అంటుంటారు. జంగ్ తన గురించి ఇలా వివరించాడు... ‘‘మా నాన్నగారు అప్పుడప్పుడు గిటార్ వాయిస్తుండేవారు. బహుశ అది చూసే నాకు దాని మీద ఆసక్తి కలిగిందో ఏమో, మూడవతరగతి చదువుతున్నప్పు డే, మా నాన్నగారిని గిటార్ నేర్పించమని అడిగాను. ఆయన బేసిక్స్ నేర్పారు. ఆ తరవాత నాకు నేనుగా నేర్చుకున్నాను. మా ఇంట్లో ఉన్న గిటారు చాలా పెద్ద గిటారు కావడం వల్ల వాయించేటప్పుడు చాలా ఇబ్బందిపడేవాడిని. తీగెలను నొక్కుతుంటే చేతులు బాగా నొప్పి చేసేవి. అయినప్పటికీ ఎంతో కష్టపడి పాటలు నేర్చుకునేవాడిని. ఒక పాట పూర్తిగా వచ్చిన వెంటనే మరో పాట వాయించాలనిపిం చేది. అప్పుడే అనుకున్నాను, నేను ఎప్పటికీ గిటార్‌ని విడిచిపెట్టకూడదని. గిటార్ మీద వచ్చే విదేశీగీతాలు విని వాటినే ప్రాక్టీస్ చేయడం వలన, కొరియన్ పాప్ సాంగ్స్, సింగర్స్ నాకు పెద్దగా తెలియదు. నాకు ఫింగర్స్టయిల్ పాటలే బాగా నచ్చుతాయి. క్లాసికల్ అంతగా ఇష్టపడను. అలాగే లిరికల్ మెలడీ ట్యూన్స్ అంటే చాలా ఇష్టం. బ్రైట్ ట్యూన్స్ కూడా ఇష్టమే. గిటార్ మీద వేరేవాళ్లు వాయించిన మెలోడియస్ ట్యూన్స్ విని నేర్చుకుంటున్నాను. ఈ మధ్యే ‘నైట్ ఫ్లయిట్’ అనే ఆల్బమ్ కంపోజ్ చేసి, యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాను. దానికి పెద్దపెద్ద వారి దగ్గర నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. నేను ప్రతి రోజూ మూడుగంటల పాటు సాధన చేస్తాను. చదువు ప్రధానం కనుక, హోమ్‌వర్క్ పూర్తయ్యాకే ప్రాక్టీస్ ప్రారంభిస్తాను. ప్రాక్టీస్ చేయనప్పుడు స్నేహితులతో ఆడుకుంటాను. సెల్మా గిటార్ (సెల్మా బ్రాండ్ గిటార్లు తయారుచేసే సంస్థ) కంపెనీ నా వీడియోలు చూసి, నా పాటలను స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చింది. నేను వాయించే పెద్ద గిటార్ చూసి, నా సైజ్‌కి సరిపడా గిటార్‌ను తయారుచేసి ఇచ్చారు. కొరియాలో మంచి గిటార్ కళాకారుడిగా పేరు సాధించాలన్నది నా ఆశయం.’’ - డా.వైజయంతి సముద్రమంటే ఇష్టం... కొరియాలో 1996, సెప్టెంబర్ 2వ తేదీన పుట్టిన సుంఘాజంగ్ ఎకోస్టిక్ ఫింగర్స్టయిల్ గిటారిస్ట్. యూట్యూబ్ ద్వారా అత్యున్నతస్థాయికి ఎదిగాడు. మే, 2013 నాటికి ఇతని గిటార్ విన్యాసాన్ని 687 మిలియన్ల మంది వీక్షించారు. 1,950,000 మంది సబ్‌స్క్రైబ్ చేశారు. అల్టిమేట్ గిటార్.కామ్ పేజీలో అతని ట్యూన్స్‌ని రింగ్‌టోన్స్‌గా డౌన్లోడ్ చేసుకోవడానికి అనువుగా ఉంచారు. యూ ట్యూబ్‌లో ఇతడికి 15 అవార్డులు వచ్చాయి. ‘పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్’ మ్యూజిక్‌ని కొన్ని మిలియన్లమంది వీక్షించారు. ఏ పాటనైనా కేవలం మూడు రోజులు ప్రాక్టీస్ చేసి, తనకు తానే రికార్డ్ చేసుకుని, యూ ట్యూబ్‌లో అప్లోడ్ చేస్తాడు. 2010లో నార్షా సోలో ఆల్బమ్‌కి చేశాడు. ట్రేస్ బండీతో కలిసి అమెరికా, స్కాండినేవియా, జపాన్లలో ప్రదర్శనలిచ్చాడు. ఇప్పటివరకు మొత్తం 18 ఆల్బమ్స్ స్వరపరిచాడు జంగ్. 2010లో ‘పర్ఫెక్ట్ బ్లూ’ 2011లో ‘ఐరనీ’ 2012లో ‘ద డ్యూయెట్స్’ 2013లో పెయింట్ ఇట్ ఇకోయిస్టిక్ అనే ఆల్బమ్‌లు విడుదల చేశాడు. 2011లో ‘ది సూయిసైడ్ ఫోర్కాస్ట్’ అనే ఒక కొరియన్ సినిమాలో నటించాడు. కొరియన్ టెలివిజన్‌లో పాపులర్ టీవీ షో అయిన ‘స్టార్ కింగ్’లో ఇతడితో ఇంటర్వ్యూ చేసినప్పుడు... గిటార్ ప్రాడి జీ, అగస్ట్ రష్ ఇన్ కొరియా... అని పిలిచారు. 2007లో సుమారు 50 గంటల క్లాసికల్ గిటార్ లెసన్స్ చెప్పాడు జంగ్. ఈ మధ్యనే డ్రమ్స్, జాజ్, పియానో కూడా నేర్చుకుంటున్నాడు. జంగ్‌కి సముద్రమంటే చాలా ఇష్టం కావడం వల్ల తన బ్లాగ్‌కి ‘బ్లూ సీ’ అని పేరు పెట్టుకున్నాడు.