బస్టాండ్‌లా.. చెత్త కుప్పలా..గిట్లుంటే ప్రయాణికులు ఎవరైనా వస్తారా...
- ఆర్టీసీ అధికారుల తీరుపై డీప్యూటీ స్పీకర్ ఆగ్రహం
- మూడ్రోజులో క్లిన్ చేయాలని ఆదేశం
- లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక
- రోడ్డు వెడల్పునకు అందరూ సహకరించాలి
మెదక్ టౌన్: బస్టాండ్‌లా.. చెత్త కుప్పలా..గిట్లుంటే ప్రయాణికులు ఎవరైనా వస్తారా?..వారికి రోగాలు రావా? ఏం చేస్తున్నారు?..అంటూ ఆర్టీసీ అధికారులపై డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి మండిపడ్డారు. గురువారం మెదక్ పట్టణానికి వచ్చిన ఆమె పాత, కొత్త బస్టాండ్‌లను పరిశీలించారు. అక్కడున్న పారిశుద్ధ్య నిర్వహణను చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్టాండ్‌లలో పారిశుద్ధ్య లోపం తీవ్రంగా వుందని, అధికారులు తమ ఇళ్ల ను గిట్లనే ఉంచుకుంటారా? మండిపడ్డారు.
కంపు కొడుతుంటే బస్టాండ్‌లోకి ప్రయాణీకులెలా వస్తారని అని ప్రశ్నించారు. ఆర్టీసీ లాభాల బాటలో నడిస్తేనే కార్మికుల కుటుంబాలు బాగుంటాయన్నారు. బస్టాండ్లను ఇలా ఉంచితే బస్సులో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తారని అన్నారు. రాబోయే రోజుల్లో మెదక్ పట్టణం జిల్లా కేంద్రం కాబోతున్నందున బస్టాండ్లతోపాటు పట్టణాన్ని సుందరనందనవనంగా తీర్చుదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టీసీ అధికారులు తమ పద్ధతి మార్చుకోవాలని, మూడ్రోజుల్లో శుభ్రం చేయించాలని ఆదేశించారు.
లేకుంటే ఇక్కడే ఉండి సిబ్బం దితో పని చేయిస్తానని పేర్కొన్నారు. ఆమెవెంట ఆర్డీఓ మెంచు నగేష్, డీఎస్పీ రాజారత్నం, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, టీఎం యూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ అశోక్, టీఆర్‌ఎస్ పట్టణాధ్యక్ష, కార్యదర్శులు గంగాధర్, కృష్ణాగౌడ్, మహిళా, మైనార్టీ శాఖల అధ్యక్షులు గాయత్రి, ఫజిల్‌తోపాటు టీఆర్‌ఎస్ శ్రేణులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ కార్మికులు ఉన్నారు.
మెదక్‌ను సుందరంగా తీర్చిదిద్దుదాం
మెదక్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుదామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. మెదక్ పట్టణంలోని ప్రధాన రహదారి వెడల్పు చేసేందుకు రూ. 16కోట్లు మంజూరైనట్లు తెలిపారు. మెదక్ పట్ట ణం జిల్లా కేంద్ర ఏర్పాటులో భాగంగా పట్టణంలోని ప్రధాన రోడ్లను వెడల్పు చేసేందుకు సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేశారని చెప్పారు. రోడ్ల వెడల్పునకు సంబంధించిన టెండర్లు కూడా పూర్తయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు.
ప్రజల ఆకాంక్షకనుగుణంగా రోడ్డును వెడల్పు చేయడం జరుగుతుందని, దీనికి పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. ఈనెల 24న హైదరాబాద్‌లో జరుగనున్న టీఆర్‌ఎస్ ప్లీనరీలో 40వేల మంది ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో పదిలక్షల మందితో భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. అంతకు ఫతేనగర్ వీధిలో జరుగుతున్న శ్రీ బాలాజీ మఠం పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నారు.