గతంలో మద్యం తాగడం తప్పు అన్న భావనతో చాలామంది దానికి దూరంగా ఉండేవారు. కానీ ఇటీవల కాలంలో తాగడం ఓ ఫ్యాషన్ అనే ధోరణి పెరుగుతుండటంతో పాటు... ఆల్కహాల్ అంటే మూడు నాలుగు దశాబ్దాల కిందట ఉన్న అపరాధభావన క్రమంగా కనుమరుగైపోతుండటంతోయువత ఎలాంటి జంకు గొంకు లేకుండా మద్యానికి అలవాటు పడుతున్నారు. దాంతో ఇటీవల యువతలో ఫ్యాటీలివర్, లివర్ ఇన్‌ఫ్లమేషన్, స్కార్‌డ్ లివర్, లివర్ సిర్రోసిస్ లాంటి ‘ఆల్కహాలిక్ సంబంధిత కాలేయ వ్యాధులు’ (ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్) పెరుగుతున్నాయి. మద్యం ఎన్నిరకాలుగా కాలేయాన్ని దెబ్బతీస్తుందో, ఎన్ని వ్యాధులు కలగజేస్తుందో తెలుసుకుందాం...
కాలేయం అత్యంత కీలకమైన అవయవం. జీర్ణక్రియకు సహాయపడటంతో పాటు బయటనుంచి జీర్ణవ్యవస్థ ద్వారా ఏ పదార్థం దేహంలోకి ప్రవేశించినా అందులోని విషాలను విరిచివేసి, వాటిని బయటకు ప్రయత్నిస్తుంది. ఆల్కహాల్ కూడా ఒకరకంగా విషమే. అందుకే దాని దుష్ప్రభావం పడకుండా కాపాడటానికి ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలో దీర్ఘకాలంగా మద్యం తాగే అలవాటున్న వ్యక్తుల్లో క్రమంగా పలు మార్పులకు లోనవుతుంది. దాంతో ఫ్యాటీలివర్, లివర్ ఇన్‌ఫ్లమేషన్, సిర్రోసిస్, కాలేయంపైన ఓ గాటులాంటిది పడే స్కారింగ్ వంటి దుష్ప్రభావాల కారణంగా క్రమంగా లివర్ ఫెయిల్యూర్‌కు దారితీస్తుంది. ఇలా కాలేయాన్ని దెబ్బతీసి, ్రపాణాపాయం వైపునకు వెళ్లేలా చేసే వ్యాధులివి...
ఫ్యాటీలివర్ : శక్తిగా మారి, దేహ అవసరాలు పూర్తయ్యాక అదే చక్కెర కాలేయంలో కొవ్వు రూపంలో పేరుకు΄ోతుంది. ఆల్కహాల్ అలవాటున్నవారిలో ఇది చాలా వేగంగా జరుగుతూ కాలేయ కణాలు కొవ్వు పేరుకున్నట్లుగా మారి΄ోతాయి. ఈ కండిషన్‌ను ఫ్యాటీలివర్ అంటారు. ఫ్యాటీలివర్‌లో మూడు దశలుంటాయి.
మొదటి దశ : ఈ దశలో కాలేయ కణాల మధ్య కొద్దిగా కొవ్వు పేరుకుంటుంది. ఇది ్రపాథమిక సమస్య.
రెండో దశ: ఈ దశను నాష్ (ఎన్‌ఏఎస్‌హెచ్) అంటారు. ఇందులో కాలేయం కొద్దిగా గాయపడటంతో పాటు కొన్ని కాలేయ కణాలు నశిస్తాయి. కొన్నిసార్లు ఇన్‌ఫ్లమేషన్‌కు కూడా గురికావచ్చు. అంతేకాదు కాలేయం గాయపడటం వల్ల... ఓ మచ్చగా అంటే... స్కార్‌లాగా ఏర్పడవచ్చు.
మూడో దశ: ఈ దశలో సిర్రోసిస్ వస్తుంది. అంటే కాలేయం పూర్తిగా తన స్వరూపాన్ని కోల్పోవడమేగాక దాన్ని ఆకృతి కూడా మారిపోతుంది. కణాలు పూర్తిగా దెబ్బతింటాయి. ఈ దశలో కాలేయ మార్పిడి తప్ప మరో వైద్యమేమీ పనిచేయదు.
ఫ్యాటీలివర్ లక్షణాలు : మొదట్లో లక్షణాలు పెద్దగా కనిపించవు. అయితే సాధారణంగా ఇతర సమస్యలకోసం అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయించుకున్నవారిలో ఇది బయటపడుతుంటుంది ∙కొందరికి కుడివైపు పోట్ట పైభాగంలో (రిబ్‌కేజ్ కింద) ΄÷డుస్తున్నట్లుగా నొప్పి వస్తుంటుంది. కాలేయం క్రమంగా పెరుగుతుండటం వల్ల ఈ నొప్పి వస్తుంది.
ఫ్యాటీలివర్ వల్ల పరిణామాలు : ∙ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చాక తగిన జాగ్రత్తలు తీసుకోక΄ోతే అది కాలేయం పూర్తిగా దెబ్బతిని΄ోయే సిర్రోసిస్ లేదా లివర్ క్యాన్సర్ వంటి పరిణామాలకు దారితీయవచ్చు ∙ఫ్యాటీ లివర్ దశల్లో మొదటిదశ నుంచి క్రమంగా రెండో దశ అయిన నాష్ (ఎన్‌ఏఎస్‌హెచ్)కూ, అక్కడి నుంచే క్రమంగా మూడో దశ అయిన సిర్రోసిస్‌కు దారి తీస్తుందని భావించడానికే వీల్లేదు. కొన్నిసార్లు నేరుగా మూడో దశ అయిన సిర్రోసిస్‌కు దారితీయవచ్చు. అందుకే ఫ్యాటీలివర్ తొలిదశలో ఇది కనిపించినప్పుడే జాగ్రత్తపడాలి.
ఫ్యాటీ లివర్‌కు చికిత్స : ∙ఆల్కహాల్‌తోనే ఫ్యాటీలివర్ వచ్చిందని తేలితే... లేదా ఇది వచ్చిన వారిలో ఆల్కహాల్ తీసుకునే అలవాట్లు ఉన్నట్లయితే వెంటనే ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి. పిండిపదార్థాలు, కొవ్వులు ఎక్కువగా తీసుకునే అలవాటు ఉంటే ఆహారంలో మార్పులు, వ్యాయామం వంటి మార్గాలను డాక్టర్లు సూచిస్తారు చాలా కొద్దిమందిలో మందులు, శస్త్రచికిత్స అవసరం కావచ్చు.
లివర్ స్కార్ : ఆల్కహాల్ అలవాటు మితిమీరిన కొందరిలో కాలేయం వాపు రావచ్చు. దాన్ని లివర్ ఎన్‌లార్జ్‌మెంట్‌గా చెబుతారు. వీళ్లలో ఆ గాయం తీవ్రమై కాలేయం మీద మచ్చ (స్కార్)లా ఏర్పడవచ్చు. ఇది చాలా ప్రమాదం తెచ్చిపెట్టే అంశం కాబట్టి జాగ్రత్తపడాలి.
లివర్ సిర్రోసిస్ : హెపటైటిస్–ఏ, హెపటైటిస్–బి, హెపటైటిస్–సి, హెపటైటిస్–డి, హెపటైటిస్–ఇ వంటి కొన్ని కాలేయ ఇన్ఫెక్షన్లు ముదరడంతో లివర్ సిర్రోసిస్ రావచ్చు. అలాగే ఆల్కహాల్ అలవాటు కారణంగా కాలేయం ఆకృతి, దానికి ఉండే సహజ స్వాభావికమైన రంగు దెబ్బతిని, అది జిగురుజిగురుగా మారవచ్చు. ఆ కండిషన్‌నే సిర్రోసిస్ అంటారు. డయాబెటిస్, స్థూలకాయం ఉన్నవారికి ఆల్కహాల్ తీసుకునే అలవాటుంటే సిర్రోసిస్ ముప్పు మరింత ఎక్కువ. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నవారికి మద్యం అలవాటు ఉంటే అది కాలేయ క్యాన్సర్‌కు దారి తీయవచ్చు. ఇలాంటివారికి ప్రమాదం మరింత ఎక్కువ.
నిర్ధారణ పరీక్షలు: ∙అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కానింగ్‌తో చాలా వరకు ఫ్యాటీలివర్ డిసీజ్ తెలుస్తుంది ∙ఫ్యాటీలివర్ మొదలుకొని మిగతా అన్ని కాలేయ సమస్యలకు లివర్ ఫంక్షన్ పరీక్ష (ఎల్‌ఎఫ్‌టీ) అవసరం. దాంతో ఏవైనా ఎంజైములు స్రవించడం వల్ల కాలేయం దెబ్బతిన్నదా అన్న విషయం తెలుస్తుంది ∙డయాబెటిస్, కొలెస్ట్రాల్ స్థాయులు, ట్రైగ్లిజరైడ్ స్థాయులు ఏమైనా పెరిగాయా అన్నది కూడా పరిశీలించాలి ∙కొందరిలో లివర్ బయాప్సీ (అంటే సూది ద్వారా కాలేయానికి సంబంధించిన చిన్న ముక్కను సేకరించి) చేయించాల్సిన అవసరం ఉంటుంది.
ఫ్యాటీలివర్ దశలోనే జీవనశైలి మార్పులో జాగ్రత్తపడటం చాలా మేలు. అయితే... పరిస్థితి లివర్ సిర్రోసిస్ దశకు చేరాక కాలేయ మార్పిడి మినహా మరే చికిత్స కూడా సాధ్యం కాదు. అందుకే ఫ్యాటీలివర్ దశలో ఉన్న సమయంలోనే ఆల్కహాల్ అలవాటు పూర్తిగా మానేయడం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment