
మాట్లాడుతున్న ఐటీడీఏ పీఓ వెంకటరావు
వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలని ఐటీడీఏ పీఓ జల్లేపల్లి వెంకటరావు అన్నారు. స్థానిక పీఎంఆర్‌సీలో శుక్రవారం సబ్‌ప్లాన్ మండలాలకు చెందిన వైద్యులు, ఎంపీడీఓ, ఈఓపీఆర్‌డీలు, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుకు కృషి చేయాలన్నారు. క్లోరినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. యాంటీలార్వా ఆపరేషన్ చేయాలన్నారు.
సీతంపేట: వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలని ఐటీడీఏ పీఓ జల్లేపల్లి వెంకటరావు అన్నారు. స్థానిక పీఎంఆర్‌సీలో శుక్రవారం సబ్‌ప్లాన్ మండలాలకు చెందిన వైద్యులు, ఎంపీడీఓ, ఈఓపీఆర్‌డీలు, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుకు కృషి చేయాలన్నారు. క్లోరినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. యాంటీలార్వా ఆపరేషన్ చేయాలన్నారు. ఎక్కడైనా వ్యాధులు వ్యాపిస్తే వెంటనే మెడికల్ క్యాంపులు పెట్టాలన్నారు. సింథటిక్ ఫైరాత్రిన్ మందును ఇళ్లల్లో స్ప్రే చేయించాలన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మలేరియా తగ్గుముఖం పట్టిందన్నారు. అయితే తనకు పంపిస్తున్న నివేదికలు కొన్ని సక్రమంగా లేవన్నారు. అన్నవరం, ఎం.సింగుపురం, బిటివాడ, దోనుబాయి, సీతంపేటల్లో ఒక్కో వైద్యాధికారి పోస్టును భర్తీ చేస్తామని తెలిపారు.
డిప్యుటేషన్ల రద్దుకు చర్యలు...
డిప్యుటేషన్ల రద్దు చర్యలు తీసుకుంటున్నామని డీఎంహెచ్‌ఓ తిరుపతిరావు తెలిపారు. పలు చోట్ల 300 మంది డిప్యుటేషన్‌పై పని చేస్తున్నారని, వారి డిప్యుటేషన్లను రద్దు చేయాలని కమిషనర్ ఆదేశించారని చెప్పారు. త్వరలో వీటిని రద్దు చేస్తామని తెలిపారు. సమావేశంలో డీసీహెచ్‌ఎస్ బి.సూర్యారావు, జిల్లా క్షయనివారణాధికారి రత్నకుమారి, అడిషనల్ డీఎంహెచ్‌ఓ మెండప్రవీణ్, డీపీఓ కోటేశ్వరరావు, డిప్యూటీడీఎంహెచ్‌వో ఎంపీవీ నాయిక్ తదితరులు పాల్గొన్నారు.