నిబంధనలు కాలరాసి.. చేపలు పెంచేసి..! | catfish farming with poultry and animal carcass | Sakshi
Sakshi News home page

నిబంధనలు కాలరాసి.. చేపలు పెంచేసి..!

Published Fri, Jan 12 2018 11:24 AM | Last Updated on Fri, Jan 12 2018 11:24 AM

భీమడోలు:   చేపల కూర మాంసప్రియులను చెవులూరిస్తుంది. చేపలు శరీరానికి ఆరో గ్యంతో పాటు మాంసకృత్తులు, విట మిన్లు, ఫాస్పరస్‌ వంటి ఖనిజాలు అందిస్తాయి. అయితే ప్రస్తుతం చేపలు తినాలంటేనే భయపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మార్కెట్‌లో దొరికే ఏ చేప పడితే ఆ చేపను కూర వండుకుని తింటే ఆరోగ్యం మాట అటుంచితే దుష్పరి ణామాలు చోటుచేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే చేపల సాగులో కోళ్ల వ్యర్థాలను, ఆరోగ్యానికి హాని కలిగించే వాటిని వినియోగించడమే కారణం. దీంతో పాటు పట్టణాల్లోని పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లలో కోళ్ల వ్యర్థాలను తిని పెరిగే ఫంగస్, క్యాట్‌ఫిష్‌ను రుచికరంగా వండి వడ్డిస్తున్నారు. ఇటువంటి వాటిపై అధికారులు దృష్టిపెట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి.

జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో ఆక్వా సా గవుతోంది. దీనిలో సుమారు 1.10 లక్షల ఎకరాల్లో చేపలు సాగుచేస్తున్నారు. అ యితే వేలాది ఎకరాల్లో ఫంగస్‌ (తెల్ల క్యాట్‌ఫిష్‌)ను సాగుచేస్తున్నారు. ప్రధానంగా కొల్లేరుతో పాటు డెల్టా మండలాల్లో నిషేధిత  ఆఫ్రికన్‌ క్యాట్‌ఫిష్‌ సాగవుతోంది. మేత ధరలు పెరగడంతో సాగుదారులు కోళ్లవ్యర్థాలను చెరువుల్లో వేసి ఫంగస్, క్యాట్‌ఫిష్‌లను పెంచుతున్నారు. 

కోళ్లవ్యర్థాలు.. పశు కళేబరాలు
కోళ్ల వ్యర్థాలు, పశు కళేబరాలను తిని పెరిగే ఫంగస్, ఆఫ్రికన్‌ క్యాట్‌ఫిష్‌ తింటే దుష్పరిణామాలు తప్పవని వైద్యులు చెబుతున్నారు. వీటిపై సరైన అవగాహన లేకపోవడంతో యథేచ్ఛగా విక్రయాలు సాగుతున్నాయి. నగరా ల్లోని పలు హోటళ్లలో క్యాట్‌ఫిష్‌ కర్రీ, ఫ్రైలను విక్రయిస్తున్నారు. 

పదేళ్ల క్రితం నిషేధం
కోరమేను, మార్పు, ఇంగిలాయి తది తర రకాలు మన దేశానికి చెందిన  సహజసిద్ధ క్యాట్‌ఫిష్‌ చేపలు. దీని శాస్త్రీయనామం క్లారియాస్‌గారీపినస్‌. విదేశాలకు చెందిన ఆఫ్రికన్‌ క్యాట్‌ఫిష్‌ను ఇక్కడ సాగు చేస్తుండటంతో సంప్రదాయక క్యాట్‌ఫిష్‌ రకాలు అంతరించిపోతున్నాయి. ఈనేపథ్యంలో పదేళ్ల కితం ఆఫ్రికన్‌ క్యాట్‌ఫిష్‌ను ప్రభుత్వం నిషేధిస్తూ జీఓ జారీచేసింది. ఫంగస్, ఆఫ్రికన్‌ క్యాట్‌ఫిష్‌లు మాంసా హార జీవులు. ఇవి  మొండిజాతులు. వీటితో అక్రమార్కులు కోట్లు గడిస్తున్నారు.

నిరోధక కమిటీ సభ్యులు వీరే
ఫంగస్, క్యాట్‌ఫిష్‌ పెంపకాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం నిరోధక క మిటీలను ఏర్పాటుచేసింది. కమిటీలో తహసీల్దార్, ఎస్సై, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్, వీఆర్వోలు సభ్యులుగా ఉంటారు. మత్స్యశాఖాధికారి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. వీరు చెరువులను తనిఖీ చేసి పట్టుకున్న కోళ్ల వ్యర్థాలు, క్యాట్‌ఫిష్‌ను గ్రామానికి దూరంగా గొయ్యి తీసి పాతి పెట్టడం, సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేయడం వంటివి చేయాలి. 

అనర్థాలు ఎన్నో..
సాధారణంగా చేపల చెరువుల్లో తడి మేత వేయరాదు. దీని వల్ల బ్యాక్టీరియా చేరుతుంది. ఫంగస్, క్యాట్‌ఫిష్‌ సాగు చేస్తున్న చెరువుల్లో కోళ్ల వ్యర్థాలు వేయడంతో వచ్చే దుర్గంధం వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతుంది. కోళ్ల ఎదుగుదలకు వినియోగించే యాంటీబయోటిక్స్‌ కోళ్ల వ్యర్థాల ద్వారా చేపలకు చేరి వాటిని తింటే మానవ శరీరంలోకి చేరతాయి. రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది. ఆయా చెరువుల్లోని మురుగు నీరు పంట బోదెల ద్వారా తాగునీటి కలుషితానికి కారణమవుతోంది. ఈ నీటిని తాగితే విరేచనాలు, వాంతులు వస్తాయి. గర్భిణులు, బాలింతల ద్వారా పుట్టబోయే బిడ్డలకు క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. గాలి, నీరు, పర్యావరణం కలుషితమవుతాయి.

వీరమ్మకుంటలో చర్మవ్యాధులు
ఫంగస్, క్యాట్‌ఫిష్‌ సాగు వల్ల పెదపాడు మండలం వీరమ్మకుంట ప్రాంతంలో పలువురికి చర్మవ్యాధులు సోకాయి. నీరు కలుషితమై దురద, దద్దర్లు వచ్చాయి.

పెదపాడు మండలంలో చేపల మేతగా వేసేందుకు సిద్ధం చేసిన ఉడికించిన కోళ్ల వ్యర్థాలను పరిశీలిస్తున్న అధికారులు,
కోళ్ల వ్యర్థాలతో సాగు చేస్తున్న చెరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement