60 ఏళ్లుగా కడుపులో పిండం! | 60 years of the fetus in the stomach ! | Sakshi
Sakshi News home page

60 ఏళ్లుగా కడుపులో పిండం!

Published Fri, Aug 7 2015 4:55 PM | Last Updated on Sun, Sep 3 2017 6:59 AM

60 ఏళ్లుగా కడుపులో పిండం!

60 ఏళ్లుగా కడుపులో పిండం!

వాషింగ్టన్: 91 ఏళ్ల  వృద్ధురాలు 60 ఏళ్లుగా కడుపులో పిండాన్ని మోస్తోంది! చిలీకి చెందిన ఎస్తెలా అనే మహిళ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది. కడుపులో కణతి ఉందేమోనన్న అనుమానంతో వైద్యులు కొన్ని రోజులు చికిత్స చేశారు. అయితే ఫలితం లేకపోవటంతో ఎక్స్‌రే, ఇతర పరీక్షలు చేసిన వైద్యులు ఆమె గర్భాశయంలో పిండం ఉండటం చూసి ఆశ్చర్యచకితులయ్యారు. అరవై ఏళ్లుగా ఆమె ఆ పిండాన్ని మోస్తోందని వైద్యులు భావిస్తున్నారు.

విషయం తెలుసుకున్న ఎస్తెలా తన కడుపులోకి పిండం ఎలా వచ్చిందో తెలియదని పేర్కొంది.  తను, తన భర్త పిల్లల కోసం ఎంతో ఎదురుచూసినా పిల్లలు కలగలేదని ఆమె తెలిపింది. ప్రస్తుతం ఆమె వయసు దృష్టా శస్త్రచికిత్స చేసి పిండాన్ని తొలగించటం ప్రమాదకరమని, ఇన్నాళ్లు ఉన్నట్లే ఉంచటం నయమని వైద్యులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement