‘మా పొట్ట కొడుతున్నారు’ | Our stomach roughed | Sakshi
Sakshi News home page

‘మా పొట్ట కొడుతున్నారు’

Aug 2 2016 12:06 AM | Updated on Jun 1 2018 8:59 PM

సమస్యలు పరిష్కరించకుండా, వేతన, ఇతర బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం, అధికారులు తమ పొట్టకొడుతున్నారని గోపాలమిత్రులు ధ్వజమెత్తారు.

అనంతపురం అర్బన్‌ :  సమస్యలు పరిష్కరించకుండా, వేతన, ఇతర బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం, అధికారులు తమ పొట్టకొడుతున్నారని గోపాలమిత్రులు ధ్వజమెత్తారు. బకాయిలు చెల్లించాలని సోమవారం కలెక్టరేట్‌ గేటు ముందు బైఠాయించి ధర్నా చేశారు. గోపాల మిత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్‌ అధ్వర్యంలో జరిగిన ధర్నాలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్‌ మాట్లాడారు.  ప్రభుత్వం గోపాల మిత్రుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ధ్వజమెత్తారు. అనంతరం జేసీ–2 సయ్యద్‌ ఖాజామొహిద్దీన్‌కి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ కోశాధికారి వెంకటనారాయణ, నాయకుల పెద్దన్న, గురివిరెడ్డి, సత్యనారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement