హైదరాబాద్: డ్రగ్స్ తో పట్టుబడ్డ దక్షిణాఫ్రికా మహిళ మూసాకు 8 వ మెట్రో పాలిటన్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మూసాను విచారించేందుకు నార్కోటిక్ అధికారులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపధ్యంలో మూసాకు 14 రోజుల రిమాండ్ కు కోర్టు అనుమతి ఇచ్చింది.
కాగా మూసా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక అధికారులు ఈ రోజు ఉదయం కోర్టులో హాజరుపరిచారు. ఆమె నుంచి 45 కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.50 లక్షలు ఉంటుందని నార్కోటిక్ సూపరింటెండెంట్ దినేష్ చౌహాన్ తెలిపారు. మూసా ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆయన తెలిపారు.